హెల్మెట్ లేకుండా సైకిల్‌పై వెళ్తే 2 వేల జరిమానా విధించిన పోలీసులు
Spread the love

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి.హెల్మెట్ లేకపోతే భారీగా జరిమానా తప్పదు.ఈ నిబంధన ద్విచక్ర వాహనదారులకు మాత్రమే కాకుండ సైకిలిస్టులకు కూడా వర్తిస్తుందని ఒక వ్యక్తికి ఏకంగా కేరళ పోలీసులు రూ.2 వేలు జరిమానా విధించారు.ఆ వ్యక్తి తన దగ్గర అంతమొత్తం లేదని మొరపెట్టుకున్నా..కనికరించలేదు.చివరికి ఆ అభాగ్యుడి దగ్గర రూ.500 కట్టించుకున్నారు.ఈ సంఘటన కేరళలోని కసర్‌గోడ్ జిల్లాలో జరిగి౦ది.దీంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఖాసిం కేరళకు వచ్చిన వలస కూలీ.అతను కంబాలాలో సైకిలు మీద ప్రధాన రహదారిపై వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు.అతనికి హెల్మెట్ లేకుండా వేగంగా వెళ్లడం నేరమంటూ రూ.2 వేల రూపాయలు జరిమానా విధించారు.

అంతేకాక సైకిలు టైర్లలోని గాలిని తీసేసారు.పోలీసులు ఖాసింకు ఇచ్చిన రసీదు మీద ఒక మహిళ కు చెందిన స్కూటరు వివరాలు ఉండడంతో షాక్ అయిన ఖాసిం తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.అతన్ని పోలీసులు రూ.500 కట్టే వరకు విడిచిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.అది వైరల్ అవ్వడంతో ఎస్పీ విచారణకు ఆదేశించారు.