టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్…
Spread the love

తెరాస యువనేత కల్వకుంట్ల తారకరామారావు కు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరొక భాద్యత ను అప్పగించారు.తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా కేటీఆర్ ను ప్రకటించారు.ఈ మేరకు తెరాస పార్టీ కార్యాలయం శుక్రవారం ఉదయం ఉత్తర్వులు జారీచేసింది.తెలంగాణా రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను నియమిస్తూ.. పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాల్సిన బాధ్యత పార్టీ మీద ఉందని అత్యంత నమ్మకస్తుడు, సమర్దుడికే తాను పార్టీ బాధ్యతలను అప్పగించానని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణ బాధ్యతలను కేటీఆర్ కే అప్పగించినట్టు ఆయన తెలిపారు.తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా కేటీఆర్ ను నియమించిన కెసిఆర్ కు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ధన్యవాదాలు తెలియజేసాడు.