హృదయవిదారకంగా రోదిస్తున్న కశ్మీర్ రైతు.. వీడియో వైరల్
Spread the love

మంచులో కూరుకుపోయిన యాపిల్ పండ్లను చూసి రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తోటలో కోసి కుప్పగా పెట్టిన యాపిల్ పండ్లు మంచుతో పూర్తిగా కప్పబడిపోయాయి. ఇది చూసిన రైతు దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. రోదిస్తూ చేతులతోనే మంచును తొలగించే ప్రయత్నం చేశాడు. తన పంటంతా నాశనం అయిందంటూ విలపించాడు. పంట నాశనం అయిందని కన్నీరుమున్నీరుగా విలపించాడు. వేసవి నుంచి అతడు పంట కోసం పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరే అయిందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ వీడియోను షేర్ చేస్తూ కామెంట్ చేశారు.