మహిళలకు  బంపర్ ఆఫర్ : 3 రూపాయిలకే  చీర !!
Spread the love

కాసం పుల్లయ్య షాపింగ్‌ మాల్‌ తెలుసా? ఆ షాపింగ్‌ మాల్‌లో కేవలం 3 రూపాయిలకే ఒక చీర ఇస్తున్నారంట. వరంగల్‌, ఆ చుట్టుపక్కల ఆడవాళ్లంతా ప్రస్తుతం చెప్పుకునే ముచ్చట ఏదైనా ఉంది అంటే అది ఇదే. ముచ్చటతో ఆపారా ఏమిటి? చకాచకా రెడీ అయిపోయి, షాపింగ్‌ మాల్‌కు పరిగెత్తారు. ఇలా వరంగల్, ఆ చుట్టుపక్కల గ్రామాల ఆడవాళ్లందరూ కాసం పుల్లయ్య షాపింగ్‌ మాల్‌లోనే. దీంతో షాపింగ్‌ మాల్‌ ఒక్కసారిగా మహిళలతో కిక్కిరిసిపోయింది.

3 రూపాయల చీరను సొంతం చేసుకునేందుకు మహిళలు పెద్ద ఎత్తున్న పోటెత్తారు. దీంతో కాసం పుల్లయ్య షాపింగ్‌ మాల్‌లో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఏంట్రా బాబు ఇంతమంది ఆడవాళ్లా!! అని నోర్లు వెళ్లబెట్టిన షాపింగ్‌ మాల్‌ సిబ్బంది, పరిస్థితిని అదుపు చేయలేక పోలీసులకు ఫోన్‌ చేశారు. షాపింగ్‌ మాల్‌ను మూసివేశారు. కానీ అప్పటికే పరిస్థితి అంతా చేదాటిపోయింది. ఆఫర్లు ప్రకటించి, షాపింగ్‌ మాల్‌ మూసివేయడంపై మహిళలు తిరగబడ్డారు. ఏం చేయాలో పాలుపోలేక పోలీసులు కూడా చేతులెత్తేశారు. కాగా, 3 రూపాయలకే చీర అంటూ కాసం పుల్లయ్య షాపింగ్‌ మాల్‌ పెద్ద ఎత్తునే ప్రచారం చేసింది. సెప్టెంబర్‌ 24,25,26 తేదీల్లో ఈ సేల్‌ను నిర్వహించబోతున్నట్టు పేర్కొంది. తన మూడవ వార్షికోత్సవం సందర్భంగా రూ.3కే చీర ఇస్తోంది. ఇవే కాకుండా ఇంకా మరెన్నో ఆశ్చర్యపరిచే అద్భుతమైన ఆఫర్లను కాసం పుల్లయ్య షాపింగ్‌ మాల్‌ ప్రకటించింది. లెగ్గింగ్‌, నైటీస్‌, టీ-షర్ట్‌లను కూడా 3 రూపాయలకే అందిస్తామంటూ తెగ ప్రచారం చేసింది. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం రూ.1.00 గంటల వరకు ఈ ఆఫర్లను మహిళల ముంగిట ఉంచింది. ప్రతి రూ.999 విలువ గల వస్త్రాల కొనుగోలుపై చుడీదార్స్‌, డ్రస్‌ మెటీరియల్‌, లెహంగాస్‌,కుర్తీస్‌ను ఆఫర్‌ చేస్తుంది. ఇన్ని చౌకైన ఆఫర్లుంటే మహిళలేమన్నా చూస్తూ ఊరుకుంటారా? ఠక్కువ వెళ్లి తమకు కావాల్సినవన్నీ కొనుక్కు వచ్చేరు. అక్కడ కూడా ఇదే జరిగింది. కానీ చివరికి పరిస్థితిని అదుపు చేయలేక షాపింగ్‌ మాల్‌నే మూసేసే దశకు వచ్చింది.