శబరిమల మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించిన మహిళా న్యాయమూర్తి!
Spread the love

ఈరోజు సుప్రీంకోర్టు శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించేందుకు అనుమతినిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. 5 సభ్యుల ధర్మాసనం 4-1 మెజార్టీ తో ఈ తీర్పును ఇచ్చింది.ఈ తీర్పు పై మిగిలిన 4 న్యాయమూర్తులతో ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా ఏకీభవించలేదు.ఈ సందర్భంగా మతపరమైన మనోభావాలను అడ్డుకోవద్దని ఇందు అన్నారు.భారతదేశంలో వేర్వేరు మత ఆచారాలు ఉన్నాయని…ఎవరైనా ఒకరు ఏదైనా మతాన్ని పాటించడానికి గౌరవించడానికి రాజ్యాంగం అనుమతిస్తుందని…అతను లేదా ఆమె నమ్మే ఆచరించే మతపరమైన ఆచారాలలో జోక్యం చేసుకోవడానికి అనుమతించదని చెప్పారు.

శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతించాలని ఆ రాష్ట్రానికి చెందిన స్త్రీలు ఎవరూ కోర్టును ఆశ్రయించలేదన్న విషయాన్ని ఇందు మల్హోత్రా తెలిపారు.అక్షరాస్యత కారణంగా కేరళ మహిళలు సామాజికంగా పురోభివృద్ధిని సాధించారని వీరిలో ఎక్కువ మంది శబరిమల ఆచరించే ఆచారాల మీద వ్యతిరేకతతో లేరని ట్రిపుల్ తలాక్, సెక్షన్ 377 కేసుల్లో నిజమైన బాధితులు కోర్టులను ఆశ్రయించారని…అందుకే ఆ కేసులు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని ఆ కేసులతో ఈ కేసును పోల్చి చూడరాదని మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా చెప్పారు.