మోకాళ్ల మీద నడచి రేస్‌ను పూర్తిచేసింది…
Spread the love

అక్టోబరు నెల చివరిలో జపాన్‌లోని పుకుఓకా నగరంలో జరిగిన ఓ రిలే మారథాన్‌ పోటీల్లో రీ లిడా అనే యువతి, ఇతర బృంద సభ్యులు పాల్గొన్నారు. మధ్యలో వేరే వాళ్ల కాలు తగిలి లిడా కిందపడిపోయింది. దాంతో ఆమె కుడి కాలు ఫ్రాక్చర్‌ అయింది. కానీ ఆమె ఆందోళన చెందకుండా మారథాన్‌లో తమ బృందం ఎలాగైనా గెలవాలన్న పట్టుదలను ప్రదర్శించింది. మిగిలిన మొత్తం దూరాన్ని మోకాళ్ల మీద పూర్తి చేసి సహచర సభ్యురాలికి రిబ్బన్‌ అందించడంతో వారు మిగతా మారథాన్‌ పూర్తి చేసి విజయం సాధించారు. ఆమె మోకాళ్ల మీద రేస్‌లో పాల్గొంటోన్న సమయంలో వెంట ఉన్న రేస్‌ మార్షల్ ఆమెకు సహకరిస్తూ, ప్రోత్సహించాడు. రెండు కాళ్ల నిండా గాయాలై, రక్తమోడుతున్నా తన ఓటమిని ఒప్పుకోకుండా ఆమె రేస్‌ను పూర్తిచేసింది. దాంతో ఆమె చూపిన నిబద్ధతకు నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు.దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.