మండపేటలో జనసేన సమావేశం.. పవన్ ను సీఎం చేయాలి
Spread the love

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి ని చేసేలా ప్రతి జన సైనికుడు కృషి చేయాలని జిల్లా జనసేన కోఆర్డినేటర్ మేడా గురుదత్ ప్రసాద్ పేర్కొన్నారు. మండపేట లయన్స్ క్లబ్ లో బుధవారం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కోఆర్డినేటర్ లు మర్రెడ్డి శ్రీనివాస్, పిల్లా సత్యనారాయణ లు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి గా గురుదత్ ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. సంస్థాగత నిర్మాణం చేపట్టి బలోపేతం చేయాలని కోరారు. తాను గత కొనేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన తనకు 2003 లో అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి అవార్డు లభించిందన్నారు. తన సేవను గుర్తించి పవన్ తనపై జిల్లా బాధ్యత అప్పగించారన్నారు. పవన్ నిబద్ధత కలిగిన నేత పవన్ అని పేర్కొన్నారు. పేదరికం రూపుమాపడమే పార్టీ లక్ష్యమన్నారు.జనసైనికులే పార్టీ కి అండగా పేర్కొన్నారు. మ్యానిఫెస్టోలో అత్యున్నత అంశాలు ఉన్నాయన్నారు. రేషన్ కు బదులు గా ప్రతి కుటుంబానికి రూ 3 వేలు నగదు అందజేస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి నెల కు ఒక గ్యాస్ సిలిండర్ ఉచితం గా ఇస్తామన్నారు.

పేద విద్యార్థులకు అండగా నిలబడటం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పటు చేస్తామన్నారు. అంగన్వాడీ ల వేతనాలు పెంపు పవన్ ప్రశ్నించడం వల్లే జరిగిందన్నారు. ప్రతి జిల్లాకు సంబంధించిన సమస్యలు గుర్తించి ఆయా ప్రాంతాల వారీగా మైక్రో మ్యానిఫెస్టో లు ప్రకటించడం గమనించ దగ్గ విషయమన్నారు. జనసైనికులు క్రమశిక్షణ తో ముందుకు సాగాలని కోరారు. కులమతాలకు అతీతంగా పార్టీ పనిచేస్తుందనే దానికి పితాని బాలకృష్ణ కు టికెట్టు ఇవ్వడమే నని పేర్కొన్నారు. జిల్లాలో 16 సీట్లలో జనసేన ఢంకా మోగించి చరిత్ర సృష్టిస్తోందన్నారు. 16 సీట్లు గెలుచుకుంటామన్నారు. పవన్ కు బంధుప్రీతి లేదని, జన సైనికులే ఆయన కుటుంబం గా పేర్కొన్నారు. గ్రామ,మండల, జిల్లా స్థాయి కమిటీల నిర్మాణం పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామన్నారు. జాబితా పొలిటికల్ ఎఫైర్స్ కమిటి కి పంపు తమన్నారు. అక్కడి అనుమతి వచ్చిన అనంతరం కమిటీ లు ప్రకటిస్తామన్నారు. వచ్చే పవన్ పుట్టినరోజు నాటికి పవన్ ఏపీ ముఖ్యమంత్రి గా అమరావతి లో ఉండాలన్నారు. మండపేట నియోజకవర్గ పరిధిలోని 3 మండలలు, టౌన్లకు ఆడ్ హాక్ కమిటీలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులుసంగీత సాయి గుణ రంజన్, తాళ్ల డేవిడ్, గింజాల శ్రీనివాస్, పార్థసారథి,చిక్కాల సుబ్బారావు, చిక్కాల శ్రీను, గోళ్ళ శ్రీను,కోణాల సుభాష్ చంద్రబోస్, గంధం సూరిబాబు, పిల్లిల్లి పోతురాజు, చింత శ్రీనివాస్, సలాదిలక్ష్మి నారాయణ, లక్ష్మీ వీరభద్రరావు, అబ్బిరెడ్డి ప్రసాద్, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.