ఇషా – ఆనంద్‌ ల గోల్డెన్‌ వెడ్డింగ్‌ కార్డ్‌….
Spread the love

ముకేశ్‌ అంబానీ, నీతాల ముద్దుల తనయ ఇషా అంబానీల రాయల్‌ వెడ్డింగ్‌ వేడుక అంశం మరోసారి వార్తల్లోకొచ్చింది.  త్వరలోనే అంగరంగ వైభవంగా జరగనున్న ఇషా, ఆనంద్ పిరామల్‌ మూడుముళ్ల సంబరానికి శుభముహూర‍్తం దగ్గరపడుతోంది.  ఈ నేపథ్యంలో  వీరి పెళ్లి శుభలేఖకు సంబంధించిన వీడియో ఒకటి నెట్‌ లో చక్కర్లు కొడుతోంది. కార్పొరేట్‌ కుటుంబాలకు తగినట్టుగా నాలుగు చిన్న బంగారు బాక్సుల్లో, అందంగా అమర్చిన అమ్మవారి చిత్రంతో రూపుదిద్దుకున్న ఈ గోల్డెన్‌ కార్డు ఆహ్వానితులను ఆకట్టుకోనుంది.