యోగా దినోత్సవం ఎలా జరుపుకొంటున్నారంటే..!
Spread the love

యోగా సాధనతో శాంతి, ఆరోగ్యం, సంతోషం ప్రాప్తిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ప్రజలతో కలిసి ఆయన యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరాఖండ్‌ అనేక దశాబ్దాలుగా యోగా, ఆయుర్వేదిక్‌కు ముఖ్య కేంద్రంగా వర్ధిల్లుతోందన్నారు. అతి తక్కువ సమయంలోనే యోగానే ప్రపంచవ్యాప్తమైందన్నారు. యోగాను భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయన్నారు. సూర్యుడి కిరణాలు అన్నివైపులా చేరినట్లే యోగా కూడా అంతటా చేరువవుతోందని పేర్కొన్నారు. యోగా అనేది ప్రాచీన, ఆధునిక ఆరోగ్య సాధనమని ప్రతి ఒక్కరూ దీన్ని ఆరోగ్య సాధనంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు.

బీర్ యోగా నుంచి డోగా వరకు:

శారీరక వ్యాయామం, మానసిక ఏకాగ్రతల సమ్మేళనం యోగా. ఆధునిక కాలంలో యోగాకు ఆదరణ పెరుగడటంతోపాటు రకరకాల యోగా ప్రక్రియలు తెరపైకి వస్తున్నాయి. ఆసనా లు, భంగిమలతో కూడిన సంప్రదా య యోగాకు ఆధునికత జోడిస్తూ వైవిధ్య యోగా ఇప్పుడు క్రేజ్‌ను సంపాదించుకుంటున్నది. నేటితరం బుర్రలోకి త్వరగా ఎక్కాలనో లేక ఆధునికత జోడిస్తే ఆదరణ లభిస్తుందనో యోగాను ట్రెండీగా మారుస్తున్నారు. 2015 నుంచి తెరపైకి వచ్చిన వాటిలో బీర్ యోగా, డాగ్ యోగా(దీనికే డోగా అని మరోపేరు), ఆర్టిస్టిక్ యోగా, ఏరియల్ యోగా, గోట్ యోగా, ఆక్రోయోగా వంటివి ముఖ్యమైనవి. బీర్ యోగా అంటే తాగుతూ కూర్చోవడం కాదు. మందుసీసాను ముందు పెట్టుకుని విన్యాసాలు చేయడం. సీసాను అందుకునేలా ఈ ఆసనాలు చేస్తుంటారు. ఇక పెంపుడు జంతువుతో కలిసి విన్యాసాలు చేయడాన్ని పట్టుకుని ఆసనాలకు దిగడం డాగ్‌యోగా (డోగా)గా పిలుస్తున్నారు. గాల్లో వేలాడుతూ చేసేది ఏరియల్ యోగా. భూమ్యాకర్షణకు వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది. ఆక్రోబాటిక్స్, యోగా, థాయ్ మసాజ్ కలిస్తే ఆక్రోయోగా అవుతుంది. చాలా పట్టణాల్లో ప్రస్తుతం ఇది ఒక ట్రెండ్‌గా కొనసాగుతున్నది. దీన్నే మరికొంత మార్చి ఆక్రో విన్యాసగా కూడా చేస్తున్నారు.

యోగాను రాజకీయ అస్త్రంగా వాడొద్దు:

ముస్లిం సంస్థలు ఒక వర్గానికి అనుసంధానించి యోగాను రాజకీయ అస్త్రంగా చేయొద్దని ముస్లిం సంస్థలు అన్నాయి. యోగాను ఎక్సర్‌సైజ్ రూపంలోనే చూడాలి తప్పించి మత కోణంలో చూడరాదని చెప్పాయి. ఇస్లాం శారీరక దృఢత్వానికి ప్రాధాన్యతనిస్తుందన్నాయి. యోగా మంచిదే కానీ దానిని అందరికీ తప్పనిసరిచేయొద్దన్నాయి. కాగా యోగాను రాజకీయ అస్త్రంగా వాడడం పరిపాటిగా మారిందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రతినిధి సజ్జాద్ నోమాని అన్నారు. యోగాను ‘రహమత్’(కారుణ్యం)గా చూడాలే తప్ప ‘జహమత్’(చింత)గా చూడరాదని అన్నారు.

మోడీకి ఉత్తరాఖండ్ సిఎం కృతజ్ఞతలు:

గురువారం జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాన వేదికగా ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌ను ఎంచుకున్నందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. డెహ్రాడూన్‌లోని అటవీ పరిశోధన సంస్థ(ఎఫ్‌ఆర్‌ఐ) క్యాంపస్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధానంగా నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ పర్యటిస్తున్నందున 3000 మంది భద్రతా సిబ్బందితో ఏరాట్లు కట్టుదిట్టం చేశారు. ప్రతి ఏడాది జూన్ 21న యోగా దినోత్సవం పాటిస్తామని ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 2014 డిసెంబర్‌లో ప్రకటించింది. కాగా ఐక్యరాజ్యసమితి ఈ చర చేపట్టడానికి భారత్ చాలా లాబీ చేసింది.