
ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. అలాగే వచ్చే ఆర్నెల్లలో రాష్ట్రంలో జరగబోయే వివిధ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత తనపై ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ప్రజలకు తాము రుణపడి ఉంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. శనివారం మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ది చిరస్మరణీయమైన, మరచిపోలేని విజయమన్నారు. టీఆర్ఎస్కు ఘనవిజయాన్ని అందించిన ప్రజలకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 98లక్షల ఓట్లు వచ్చాయన్నారు. కాంగ్రెస్‌కు- టీఆర్ఎస్కు 48లక్షల అంతరం ఉందని చెప్పారు. 103 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయని చెప్పారు. ఎన్నికలకు ముందు తాను చెప్పిన మాట నిజమైందని కేటీఆర్ తెలిపారు.