కియా మోటార్స్‌తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం
Spread the love

ఆటో మొబైల్‌ రంగంలో ఏప కీలక అడుగు వేసింది. రాబోయే తరం పర్యావరణ రవాణా పై చంద్రబాబు సమక్షంలో కియా మోటార్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈరోజు ఉదయం సచివాలయంలో ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ ఎలక్ట్రికల్‌ కార్లను సిఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్లకు ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 455 కిలోమీటర్ల వరకు ప్రయాణం సాగించవచ్చు. అందుకోసం విజయవాడలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా కియా బ్యాటరీ కార్లను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. కార్ల ప్రత్యేకతలను కియా ప్రతినిధులు వివరించారు. అనంతరం కియా కారులో సీఎం చంద్రబాబు, కియా మోటార్స్‌ ఎండీ సచివాలయం ఐదో బ్లాక్‌ నుంచి ఒకటో బ్లాక్‌ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కియా మోటార్స్‌ ముందుకు రావడం ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్‌లో ఇంకా పెద్దఎత్తున పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. కియా మోటార్స్‌ సంస్థ ప్రతినిధులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా చెప్పారు.