నరేంద్రమోదీ కు పుల్లెల గోపీచంద్ సవాల్…
Spread the love

హరితాహారం లో భాగంగా మొదలు పెట్టిన “గ్రీన్ ఛాలెంజ్” కు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన స్పందన లభిస్తుంది. ఇందులో భాగంగా టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు“గ్రీన్ ఛాలెంజ్” ను విసిరారు.రాజమౌళి విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన పుల్లెల గోపీచంద్ కూడా ఆ ఛాలెంజ్ ను పూర్తి చేసి అతను కూడా  భారత ప్రధాని నరేంద్ర మోదీకి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

“గ్రీన్ ఛాలెంజ్” లో భాగంగా మొక్కను నాటిన పుల్లెల గోపీచంద్ తిరిగి ఆ ఛాలెంజ్ ను ప్రధాని నరేంద్రమోదీ, షూటర్ అభినవ్ బింద్రా, క్రీడామంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్,బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌ లను నామినేట్ చేసారు.

ఈ సందర్భంగా పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ… “దేశాన్ని పచ్చగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా తను కూడా ఒక మొక్కను నాటినట్లు తెలియజేసారు”.అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ “గ్రీన్ ఛాలెంజ్” కు విశేషమైన స్పందన లభిస్తుంది.ఈ గ్రీన్ ఛాలెంజ్‌కు నామినేట్ అయిన వాళ్ళు మొక్కలు నాటుతూ ఇంకో ముగ్గురికి సవాలు విసురుతున్నారు.