పసిడి ధర పై చూపులు
Spread the love

పసిడి ధర పై చూపులు చూస్తోంది. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర ఇప్పటికే రూ.32,000 దాటి పోయింది. డాలర్‌తో రూపాయి బలపడడం కొనసాగితే త్వరలోనే దేశీయ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ.33,500కు చేరుతుందని మార్కెట్‌ వర్గాల అంచనా. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి రూ.72.50 దగ్గర ట్రేడవుతోంది. అది మరింత బలపడి రూ.71కి చేరితే 10 గ్రాముల బంగారం ధర మరింత పెరగుతుందని మార్కెట్‌ వర్గాలు తెలిపారు.

ఇదిలా ఉంటే.. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ‘ఫెడరల్‌ రిజర్వు’ మరోసారి వడ్డీ రేట్లు పెంచుతుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అదే జరిగితే అమెరికా ప్రభుత్వ రుణ పత్రాలపై వడ్డీ రేట్లు మరింత పెరిగి బంగారం ధర తగ్గుతుందన్నది మార్కెట్‌ వర్గాల అంచనా. ‘డిసెంబరు చివరి నాటికి ఔన్స్‌ బంగారం ధర ప్రస్తుత స్థాయి నుంచి 80 నుంచి 100 డాలర్ల వరకు తగ్గే అవకాశం ఉన్నాది. ఆ ప్రభావంతో దేశీయ మార్కెట్‌లోనూ 10 గ్రాముల పసిడి ధర రూ.1,200 నుంచి రూ.1,400 వరకు తగ్గుతుందని మా అంచనా’ అని ఏంజిల్‌ బ్రోకింగ్‌ సంస్థ కమోడిటీస్‌ చీఫ్‌ ప్రతమేష్‌ మాల్యా తెలిపారు.