హైదరాబాద్ అబిడ్స్‌లో ఆత్మహత్య చేసుకున్న యువతి
Spread the love

హైదరాబాద్ అబిడ్స్ లో ఈరోజు విషాదం చోటు చేసుంది. మయూరి బిల్డింగ్ పై నుంచి దూకి కాచిగూడకు చెందిన జెస్లీస్ కౌర్  (18)  ఆత్మహత్య చేసుకుంది. నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతోనే ఈ అఘాయిత్యం చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో మయూరి బిల్డింగ్ లోకి కౌర్ వెళ్లినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డైంది. నేరుగా 9వ అంతస్తుపైకి వెళ్లింది. అక్కడ్నుంచి కిందకు దూకింది. బిల్డింగ్ పైనుంచి దూకుతున్నప్పుడు చుట్టుపక్కల వారు, కింద ఉన్న వారు కేకలు వేస్తూ కొందరు పోలీసులకు ఫోన్ చేశారు.. మరికొందరు కాపాడేందుకు బిల్డింగ్ పైకి పరిగెత్తారు.. మరికొందరు దుప్పటాలు, కవర్లు తెచ్చి కింద పడకుండా కాపాడాలని ప్రయత్నాలు చేస్తున్నారు.. అందరూ ఎవరికి వారు కాపాడాలనే ఆలోచనలో ఉండగానే బిల్డింగ్ చివరి అంచు వరకు వచ్చిన కౌర్.. నిమిషం కూడా ఆలస్యం కాకుండా వెంటనే దూకేసింది. తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ పైనుంచి కింద పడటంతో స్పాట్ లోనే చనిపోయింది.

అప్పటినుంచి ఆమె ముభావంగా ఉంది. ఇంట్లోవాళ్లు సముదాయించిన పరిస్థితితో మార్పు రాలేదు. కొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుందిలే అని కుటుంబసభ్యులు అనుకున్నారు. కానీ.. ఇలా ప్రాణాలు తీసుకుంటుందని ఊహించలేకపోయారు. రాత్రంతా జెస్లిస్ కౌర్‌ను తల్లిదండ్రులు సముదాయించారు. ఫ్రెండ్స్ కూడా ధైర్యం చెప్పారు. కానీ తెల్లవారేసరికి ఘోరం జరిగిపోయింది.

నిద్ర లేవగానే మామూలుగానే ఉన్న జెస్లిస్ కౌర్.. ఆ తర్వాత బయటకు వెళ్లివస్తానని చెప్పి హోండా యాక్టివ్‌పై అబిడ్స్‌కు వచ్చింది. అప్పటికే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న కౌర్ మయూరి కాంప్లెక్స్‌కు వచ్చింది. కాంప్లెక్స్ భవనాన్ని ఓసారి చూసిన ఆమె పై అంతస్తుకెక్కి దూకాలని నిర్ణయించుకుంది. ఆమె పైకి వెళుతున్నా ఎవరికి అనుమానం రాలేదు. ఒక్కసారిగా పైనుంచి జెస్లిస్ కౌర్ దూకడం… పెద్ద శబ్దం రావడంతో కలకలం రేగింది. అందరూ వచ్చి చూసేసరికి జెస్లిస్ కౌర్ రక్తపుమడుగులో ఉంది. 108 సిబ్బంది వచ్చేసరికి ఆమె ప్రాణాలు విడిచింది. మొదట అనుమానాస్పదంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు యాక్టివ్ హోండా నెంబర్ ఆధారంగా మృతి మిస్టరీని చేధించారు. కాచిగూడకు చెందిన జెస్లిస్ కౌర్‌గా గుర్తించారు. నీట్‌లో అర్హత సాధించనందునే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని తేల్చారు.

Leave a Reply