ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ధరలకు స్మార్ట్‌ఫోన్లు..!
Spread the love

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త‌న సైట్‌లో బిగ్ దివాలీ సేల్ ను ఇవాళ ప్రారంభించింది. ఈ సేల్ ఈ నెల 5వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. అందులో స్మార్ట్‌ఫోన్లు, యాక్స‌స‌రీలు, ఎల్ఈడీ టీవీలు, ల్యాప్‌టాప్‌లు త‌దిత‌ర అనేక ర‌కాల ప్రొడ‌క్ట్స్‌పై ఆక‌ట్టుకునే రాయితీలు, ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి ఐటమ్స్‌ను కొనుగోలు చేస్తే కస్టమర్లకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే పలు ఉత్పత్తులపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.

 • గూగుల్ పిక్స‌ల్ 2 ఎక్స్ఎల్ ధ‌ర రూ.40,999 (రూ.5వేలు త‌గ్గింది)
 • అసుస్ జెన్‌ఫోన్ 5జ‌డ్ 8జీబీ + 256 జీబీ – ధ‌ర రూ.31,999 (రూ.5వేలు త‌గ్గింది)
 • శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8 – రూ.32,990 (రూ.12వేలు త‌గ్గింది)
 • అసుస్ జెన్‌ఫోన్ 5జ‌డ్ 6జీబీ+128 జీబీ – ధర రూ.27,999 (రూ.5వేలు త‌గ్గింది)
 • పోకో ఎఫ్1 8జీబీ + 256 జీబీ – రూ.27,999 (రూ.2వేలు త‌గ్గింది)
 • హానర్ 10 – రూ.24,999 (రూ.11వేలు త‌గ్గింది)
 • నోకియా 6.1 ప్ల‌స్ – రూ.14,999 (రూ.1వేయి త‌గ్గింది)
 • షియోమీ రెడ్ మీ నోట్ 5 ప్రొ 4జీబీ + 64జీబీ – రూ.12,999 (రూ.2వేలు త‌గ్గింది)
 • హాన‌ర్ 9ఎన్ 3జీబీ + 32 జీబీ – రూ.11,999 (రూ.2వేలు త‌గ్గింది)
 • మోటో జీ6 ప్లే – రూ.10,999 (రూ.1వేయి తగ్గింది)
 • నోకియా 5.1 ప్ల‌స్ – రూ.10,499 (రూ.500 త‌గ్గింది)

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో యాపిల్ వాచ్ సిరీస్ 3 స్మార్ట్‌వాచ్‌లు రూ.23,900 ప్రారంభ ధ‌ర‌కే ల‌భిస్తుండ‌గా, ఎక్స్‌బాక్స్ వ‌న్ ఎస్ 1టీబీ క‌న్సోల్ రూ.21,990 ధ‌ర‌కు ల‌భిస్తున్న‌ది. అలాగే ల్యాప్‌టాప్‌లు, ప‌వ‌ర్‌బ్యాంక్‌లు, ఎల్ఈడీ టీవీలు, హార్డ్ డిస్క్‌ల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్ల‌ను ఇస్తున్నారు.