హైదరాబాద్‌లో తొలి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్
Spread the love

నగరాల్లోని కాలుష్యాన్ని నిర్మూలించడానికి.. పర్యావరణ హితంగా మార్చడానికి.. కర్బన్‌ ఉద్గారాలను వెలువరించే వాహనాలను ప్రభుత్వాలు తగ్గిస్తున్నాయి. వీటి స్థానాల్లో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రవేశపెడుతున్నాయి. అయితే ఈ వెహికిల్‌ నడవాలంటే ఛార్జింగ్‌ తప్పనిసరి . కాబట్టి ఈ వాహనాలు నడవడం కోసం ప్రత్యేకంగా ఛార్జింగ్‌ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం తొలి ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు అయింది. నేడు హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ హైదరాబాద్‌లోని  రాయదుర్గంలో మిస్సెస్‌ దినేష్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌లో ఈ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ను లాంచ్‌ చేసింది. మధ్యాహ్నం ఒకటిన్నరకు ఈ లాంచింగ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది… గ్రీన్‌ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు హెచ్‌పిసిఎల్‌ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ను హెచ్‌పీసీఎల్‌ తన ఇన్‌-హౌజ్‌ నిపుణుల సహాయ సహకారలతో అభివృద్ధి చేసింది.

తెలంగాణ వ్యాప్తంగా పైలెట్‌ బేసిస్‌లో ఈ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు హెచ్‌పీసీఎల్‌ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ను హెచ్‌పీసీఎల్‌ తన ఇన్‌-హౌజ్‌ నిపుణుల సహకారంతో అభివృద్ధి చేసింది. గ్రీన్‌ కార్యక్రమంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేసింది. మిస్సెస్‌ దినేష్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ను హెచ్‌పీసీఎల్‌ 2015లో ఏర్పాటు చేసింది. ఈ రసీదుల సౌకర్యంతో ఆటోమేషన్‌ను ఇది కలిగి ఉంది. ఇంధన కొనుగోలు చేసిన కస్టమర్లు వెంటనే ఎస్‌ఎంఎస్‌లు పొందేలా కూడా హెచ్‌పీసీఎల్‌ దీన్ని రూపొందించింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసే వారికి ప్రోత్సహకాలను, మౌలిక సదుపాయాలను అందించనున్నట్టు అంతకముందే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ రంగం కోసం నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని  కూడా ప్రభుత్వం ప్రకటించింది.