స్టార్‌ హోటల్లో వ్యభిచారానికి యత్నం డ్యాన్సర్లు అరెస్ట్…
Spread the love

హైదరాబాద్ నగరంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లోని పార్క్‌ హయత్‌ హోటల్లో వ్యభిచారానికి పాల్పడేందుకు ప్రయత్నించిన ఓక యువకుడితోపాటు ఇద్దరు డ్యాన్సర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.హోటల్ సిబ్బంది కి ధ్రువీకరణ పత్రాలు చూపించే క్రమంలో వాళ్ళు ముగ్గురు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారిఫై అనుమానం వచ్చిన హోటల్‌ సిబ్బంది ముందుగానే విషయాన్ని పసిగట్టి స్థానిక పోలీసులకు సమాచారమివ్వడంతో ఈ ఉధతం బయటపడింది.

పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లోని పార్క్‌ హయత్‌ హోటల్‌కు శనివారం రాత్రి 9 గంటల సమయం లో ఇబ్రహీం అనే వ్యక్తి తో పాటు మరోక ఇద్దరు యువతులు కూడా వచ్చారు.ఇబ్రహీం పేరు మీద హోటల్ లో రూమ్ బుక్ చేసి  ఉంది.రూమ్ తాళాల కోసం అతను హోటల్‌లో రిసెప్షన్‌ కౌంటర్‌ దగ్గరకి వెళ్లాడు.అక్కడి సిబ్బంది అతని గుర్తింపు పత్రాలను అడిగారు.ఆయన తో వచ్చిన ఇద్దరు యువతుల గురించి ఆరా తీశారు.అప్పుడు వారు ముగ్గురు పొంతన లేని సమాధానాలు చెప్పారు.వారిఫై అనుమానం వచ్చిన రిసెప్షన్‌ సిబ్బంది వాళ్ళకి ఎలాంటి అనుమానం రాకుండా పక్కన కూర్చోపెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు.వెంటనే హోటల్‌కు చేరుకున్న పోలీసులు ఇబ్రహీంను అదుపులోకి తీసుకొని అతన్ని విచారించారు.

ఇబ్రహీం ఎంబీఏ చదివానని సల్మాన్‌ అనే వ్యక్తితో తనకు పరిచయం ఉందని అతనే ఆ ఇద్దరు యువతులను వ్యభిచారం కోసం బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12 లో తనకు అప్పగించాడని చెప్పాడు.ఇద్దరు యువతుల కోసం రూ.11 వేలు సల్మాన్‌కు  చెల్లించినట్లు తెలిపాడు. ఇబ్రహీంతో పాటు ఆ ఇద్దరు అమ్మాయిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పట్టుబడిన ఆ ఇద్దరు అమ్మాయిలు ఒకరు నగరానికి చెందిన వారు, మరొకరిని పశ్చిమ బెంగాల్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.వారిద్దరిని  పునరావాస కేంద్రానికి తరలించారు.ఇబ్రహీంపై కేసు నమోదు చేశారు. సల్మాన్‌ మాత్రం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలియజేసారు.