దీపావళి సందర్భంగా జనగణమన ఆలపించిన దుబాయ్ వాసులు ….
Spread the love

దుబాయ్‌లో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. దుబాయ్ ప్రభుత్వం, భారత కాన్సులేట్ జనరల్‌తో కలిసి తొలిసారిగా పది రోజుల పాటు దీపావళి వేడుకలను నిర్వహిస్తున్నారు. నవంబరు 1 నుంచి ప్రారంభమైన దివాళీ వేడుకలు నవంబరు 10 వరకు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా మంగళవారం దుబాయ్ పోలీస్‌ బ్యాండ్‌ చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. భారత జాతీయగీతాన్ని దుబాయ్‌ పోలీసులు తమ వాద్యాలతో ఆలపించిన తీరు భారతీయుల మదిని దోచింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.