సీఎం భార్య  చెదాస్తాం, సాహసం, సెల్ఫీ పిచ్చి : వీడియో వైరల్
Spread the love

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత సెల్ఫీ పిచ్చి ఆమె భద్రతా సిబ్బందికి ముచ్చెమటలు పట్టించిందనే చెప్పాలి. శనివారం ముంబై-గోవా క్రూయిజ్ షిప్ లో విహరించిన ఆమె ప్రమాదకరంగా నౌక అంచుకు వెళ్లి ఎటువంటి భద్రతలేని చోట సెల్ఫీ తీసుకుంది. ఆమె కింద పడిపోతుందా అన్న భయంతో సెక్యూరిటీ సిబ్బంది ఎంత వారించినా వినకుండా సెల్ఫీ కోసం అంతటి దుస్సహాసానికి పాల్పడడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దదుమారామే రేపుతోంది. ముంబై-గోవాల మధ్య తొలి క్రూయిజ్ నౌక ‘ఆంగ్రియా’ను శనివారం ప్రారంభించారు. సీఎం ఫడ్నవీస్ తోపాటు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ జెండా ఊపి నౌక ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ వెంటనే సీఎం భార్య అమృత ఫడ్నవీస్ నౌక అంచుకు వెళ్లి కూర్చొని సెల్ఫీ తీసుకున్నారు. నౌక ముందుకు కదులుతుంటే ఏమాత్రం లెక్క చేయకుండా పడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్న ఆమె అలా ఫొటో తీసుకోవడం విమర్శలకు తావిచ్చింది. భద్రతా అధికారులు ఆందోళనకు గురవుతున్నా ఆమె పట్టించుకోకపోవడం గమనార్హం.

అయితే ఈ సరికొత్త ఆంగ్రియా నౌకలో అత్యాధునిక సదుపాయాలున్నాయి. మొత్తం 104 గదులు – 400 మంది ప్రయాణించవచ్చు. 67 మంది సిబ్బంది ఉంటారు. రెస్టారెంట్లు – బార్లు – ఈతకొలను – డిస్కోథిక్ – రీడింగ్ రూమ్ – స్పా ఇలా సకల సదుపాయాలతో ఈ నౌకను పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు తయారు చేశారు. ముంబై నుంచి గోవాకు 16 గంటల్లో చేరుకుంటుంది. వారానికి నాలుగుసార్లు ఈ షిప్ తిరుగుతుంటుంది. టికెట్ ధర రూ.7వేల నుంచి రూ.12 వేల వరకు నిర్ణయించారు. ముంబైలోని ప్రిన్సెస్ డక్స్ పర్పుల్ గేట్ నుంచి మర్మగోవా డక్ వరకు ప్రయాణిస్తుంది.