ఈ దసరాకి ముగ్గురు భామలతో విజయ్ దేవరకొండ..!
Spread the love

విజయ్ దేవరకొండ సినిమా నుంచి అభిమానులు ఆశించేది అంత ఇంత కాదు… ఇటీవల వచ్చిన ‘నోటా’ పరాజయంపాలైంది. దాంతో ఆల్రెడీ పూర్తయిన ‘టాక్సీవాలా’ సినిమా కోసం వాళ్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఒక వైపున ‘డియర్ కామ్రేడ్’ చేస్తూనే ఆయన మరో సినిమాకి సిద్ధమవుతున్నాడు. కేఎస్ రామారావు నిర్మిస్తున్నఈ సినిమాకి క్రాంతిమాధవ్ దర్శకత్వం వహించనున్నాడు.

దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 18వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ఇప్పటివరకూ ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేశ్ నాయికలుగా నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. మూడవ కథానాయికగా ‘ఇజాబెల్లీలీట్’ ఉందనేది తాజా సమాచారం. బ్రెజీలియన్ మోడల్ అయిన ఈ సుందరి, ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు చేస్తోంది. ఈ సినిమాతో ఆమె తొలిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతోంది.