తప్పిన పెను ప్రమాదం.. వీడియో
Spread the love

సైకిల్ పై వెళ్తున్న యువకుడిని రైలు ఢీకొట్టిందేమో అని ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో ఇది. నెదర్లాండ్స్ ఓ రైల్వే క్రాసింగ్ వద్ద గేట్లు పడ్డాయి. రైలు వెళ్లిన తర్వాత ఓ యువకుడు తన సైకిల్ తో పట్టాలను దాటుతున్నాడు. ఇంతలోనే మరో వైపు నుంచి రైలు వేగంగా దూసుకువచ్చింది. చేసేదేమీ లేక సదరు యువకుడు అతివేగంతో సైకిల్ ను తొక్కుతూ క్షణం తేడాతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వెంట్రుకవాసిలో ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.