‘విశ్వాసం’ సెట్లో డ్యాన్సర్ హఠాన్మరణం…
Spread the love

శివ డైరెక్షన్‌లో హ్యాట్రిక్‌ కొట్టన అజిత్‌ మరోసారి ‘విశ్వాసం’ తో తన అభిమానులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ షూటింగ్‌ ప్రస్తుతం పుణెలో జరుగుతోంది. ఓ పాటను చిత్రీకరిస్తుండగా విషాదం చోటుచేసుకుంది. విశ్వాసంకు సంబంధించిన పాటను షూట్‌ చేస్తుండగా డ్యాన్సర్‌ ఓవియన్‌ శరవణన్‌ హఠాత్తుగా మరణించాడు. గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయిన అతన్ని చిత్రయూనిట్‌ ఆసుపత్రికి తరలించింది. కానీ అప్పటికే ఆయన మృతి చెందాడు. అజిత్‌ తన సొంత ఖర్చులతో మృతదేహాన్ని విమానంలో చెన్నైకి చేరేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఆయన కుటుంబానికి తన వంతుగా 8లక్షల ఆర్థిక సహాయాన్నిఅందించారు.