ఏపి లో పెథాయ్ తుపాను ఎఫెక్ట్ : ప‌లు రైళ్లు, విమానాలు   ర‌ద్దు
Spread the love

ఆంధ్రప్రదేశ్ లో పెథాయ్ తుపాను ఎఫెక్ట్ ర‌వాణా వ్య‌వ‌స్థ పై ప‌డింది. ఇప్ప‌టికే ఏడు జిల్లాలో పెథాయ్ ప్ర‌భావం ఉండ‌టంతో. ..ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు..విమాన‌యాన అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. రాష్ట్ర ప్ర‌భుత్వం నుండి ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం సేక‌రిస్తున్నారు. రైలు ప‌ట్టాల వెంబ‌డి నిరంత‌రం గ‌స్తీని కొన‌సాగించాల‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే జీయం ఆదేశించారు, విజ‌య‌వాడ‌- గుంటూరుల్లో రైల్వే హెల్ప్ లైన్ల‌ను ఏర్పాటు చేసారు. తుఫాను కార‌ణంగా ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసారు. విమానాల రాక పోక‌ల పైనా ప్ర‌భావం ప‌డింది. తుపానుపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రయాణికుల భద్రత, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కోస్తాంధ్రాలోని అన్ని రైల్వేస్టేషన్ల స్టేషన్‌ మాస్టర్లు రాష్ట్ర అధికారులు, రైల్వే ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని, పరిస్థితిని బట్టి సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ఇక అవసరమైతే.. ఆహారం, నీరు తదితర సదుపాయాలు కల్పించాలని సీయం ఆదేశించారు.

ప‌లు రైళ్ల ర‌ద్దు..విమానాల పైనా ప్ర‌భావం.. పెథాయ్ తుఫాను కార‌ణంగా ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా ద‌క్షిణ మ‌ధ్య రైల్వే గోదావ‌రి జిల్లాల మీదుగా వెళ్లే ప‌లు రైళ్ల ను ర‌ద్దు చేసింది. జ‌న్మ‌భూమి, సింహాద్రి, ర‌త్నాచ‌ల్ ఎక్స్‌ప్రెస్ ల‌ను ఈ రోజు వ‌ర‌కు ర‌ద్దు చేసారు. కాగా, మ‌రో 21 ప్యాసింజ‌ర్ రైళ్ల‌ను సైతం ర‌ద్దు చేస్తూ ద‌క్షిణ మ‌ధ్య రైల్వే నిర్ణ‌యం తీసుకుంది. తుఫాను ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుం ద‌నే ఉద్దేశంతో ప్ర‌యాణీకులు ఇబ్బంది ప‌డ‌కుండా..జాగ్ర‌త్త‌ల్లో భాగంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు తీవ్ర తుపాన్‌గా మారిన పెథాయ్‌ శరవేగంగా దూసుకొస్తుంది. కాకినాడకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర తుపాన్‌ తూర్పు గోదావరి జిల్లా వైపు వేగంగా కదులుతుంది. పెథాయ్‌ సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తుని, యానాం లమధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను ప్ర‌భావం తో ఒక వైపు రైళ్ల ర‌ద్దు..మ‌రో వైపు విశాఖ విమ‌నాశ్ర‌యంలో ర‌న్ వే అనుకూలంగా లేక‌పోవ టంతో విమ‌నయానం పైనా ప్ర‌భావం చూపింది.