అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..
Spread the love

ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం నాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా వద్ద హయత్‌నగర్ డిపోకు చెందిన ఓ బస్సు అదపుతప్పి సికింద్రాబాద్ వైపు దూసుకొచ్చింది. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీకొట్టింది. దాంతో బైక్‌పై ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ నిర్లక్షమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

పీర్జాదిగూడ మునిసిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్‌లో నివసిస్తున్న వీరు ఆదివారం పనిమీద  అన్నోజిగూడకు బయలుదేరారు. నారపల్లి చౌరస్తా వరకూ వచ్చి ఆర్టీసీ బస్సుకు దారి ఇచ్చేందుకు వాహనాన్ని నిలిపారు. అదే సమయంలో ఏపీ 29జడ్‌ 2157 నంబరు కలిగిన ఆర్టీసీబస్సును  మరో టూవీలర్‌ వేగంగా క్రాస్‌ చేసి వెళ్లింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేసి హఠాత్తుగా  సీట్లో నుంచి బస్సులో కింద పడిపోయాడు. దాంతో అదుపు తప్పిన బస్సు  డివైడర్‌ ఎక్కింది.  బస్సు వెళ్లాక వెళ్దామని అక్కడే ఆగి ఉన్న కోటేశ్వరరావు వాహనాన్ని బస్సు ఢీకొట్టింది.  తీవ్రంగా గాయపడిన వీరిద్దరినీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయారు. పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ టీవీ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలానికి మల్కాజ్‌గిరి ఏసీపీ గోనె సందీప్‌రావు సందర్శించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో మరో ముగ్గురు కూడా గాయపడినట్లు సమాచారం. ప్రమాదానికి డ్రైవర్‌ సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ బస్సు నడపడమే కారణమని కొందరు స్థానికులు తెలిపారు.