కర్నాటకలో బలపరీక్ష కుమారస్వామి
Spread the love

కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కుమారస్వామి ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ నేత యడ్యూరప్ప కాంగ్రెస్, జేడీఎస్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. కర్నాటక శాసనసభలో జరిగిన బలపరీక్షలో సిఎం హెచ్ డి కుమారస్వామి విజయం సాధించారు. కాంగ్రెస్, జెడిఎస్ కూటమికి 117 మంది ఎంఎల్‌ఎలు మద్దతు ప్రకటించారు. బలపరీక్షలో విజయం అనంతరం కాంగ్రెస్, జెడిఎస్ సభ్యులు ఒకరినొకరు అభినందనలు తెలుపుకున్నారు. ఇక బలపరీక్షకు ముందే యడ్యూరప్ప సారథ్యంలోని బిజెపి సభ్యలు వాకౌట్ చేశారు. బిజెపికి 104 మంది మద్దతు ప్రకటించడంతో శాసన సభలో బిజెపి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 24 గంటల్లోగా రైతులకు రుణమాఫీ చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని బిజెపి సభ్యులు ప్రకటించారు.

ఊహించినట్లే విశ్వాసపరీక్షలో కర్ణాటక నూతన ముఖ్యమంత్రి కుమారస్వామి గెలుపు లాంఛనప్రాయమే అయ్యింది. విధానసభలో శుక్రవారం నిర్వహించిన బలపరీక్షలో కుమారస్వామి సునాయాసంగా నెగ్గారు. విశ్వాస పరీక్షకు ముందే భాజపా విధాన సభ నుంచి వాకౌట్‌ చేయడంతో మూజు వాణి ఓటుతో జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వం నెగ్గినట్లు స్పీకర్‌ ప్రకటించారు. కుమారస్వామికి 117 మంది సభ్యుల మద్దతు లభించింది

కుటుంబ సభ్యులకు కూడా ఫోన్‌లో అందుబాటులో రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఇంటిబెంగతో బాధపడుతున్నట్లు సమాచారం. ఏ రాజకీయ పార్టీకి మెజార్టీ దక్కకపోవడంతో బీజేపి తమ ఎమ్మెల్యేలను ఎక్కడ ఎగరేసుకునిపోతుందన్న భయంతో వీరిని రిసార్టుల్లో జేడీఎస్,కాంగ్రెస్ పార్టీలు బంధించాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హిల్టన్ ఎంబసీ గోల్ఫ్‌లింక్స్ రిసార్టులో ఉంచారు. జేడీఎస్ ఎమ్మెల్యేలను గోల్ఫ్‌షైర్ రిసార్టులో ఉన్నారు. కాగా ఎమ్మెల్యేలు ఇంటి బెంగతో ఉన్నారన్న సమాచారంలో నిజం లేదని, బంధీలు కారని, లగ్జరీ రిసార్టుల్లో వారున్నారని, అన్ని సదుపాయాలు వారికికల్పించామని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి..

దీంతో బలపరీక్షలో కుమారస్వామి నెగ్గినట్టు స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు. అంతకుముందు, సభలో విశ్వాస తీర్మానాన్ని కుమారస్వామి ప్రవేశపెట్టారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం బీజేపీ నేత యడ్యూరప్ప మాట్లాడుతూ, 24 గంటల్లోగా రైతు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. గౌడ కుటుంబసభ్యులపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఆరోపించారు. బీజేపీని గతంలో కాంగ్రెస్, జేడీఎస్ వంచించాయని, వారికీ అదే గతి పడుతుందంటూ మండిపడ్డారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలంతా సభ నుంచి వాకౌట్ చేయడం ద్వారా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అనంతరం మూజువాణి ఓటుతో హెచ్‌డీ కుమారస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.