ఇలా   మీరు ఓ సారి ప్రయత్నించరు ??
Spread the love

ఇప్పుడు ఇంటర్‌నెట్‌ ఓ వీడియో ఇప్పుడు ను తెగ షేక్‌ చేస్తోంది. కేవలం కొన్ని సెకన్ల వ్యవధి ఉన్న ఈ వీడియోకు వస్తోన్న రెస్పాన్స్‌ మాత్రం అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఇప్పటికే ఈ వీడియోకు ఎన్నో  లక్షల వ్యూస్‌,  మరియు  వేల కొద్ది కామెంట్స్‌ వస్తున్నాయి. ఈ వీడియోను చూసిన వాళ్లంతా, వీడియోలో చూపించినట్లు చేయడానికి తాము చాలా వరకు  ప్రయత్నించాం,అయితే  కానీ సక్సెస్‌ కాలేకపోతున్నామంటున్నారు. ఇంతలా చెప్తున్నామంటే అది ఎంత కష్టమైనదో అనుకుంటే పొరబడి పప్పు లో కాలు వెసినట్టే. ఎందుకంటే ఇది ‘ఇల్యూషన్‌’ అంటే భ్రాంతికి సంబంధించిన వీడియో. ఇంటర్‌నెట్‌లో మనం అప్పుడప్పుడు ఆప్టికల్‌ ఇల్యూషన్స్‌ కు సంబంధించిన వీడియోలు చూస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతుంది కూడా అలాంటి వీడియోనే.

ఇక ఈ వీడియోలో ఓ యువతి ఒక చేతిని ముందుకు చాచడ౦,అమె  మరో చేతితో ముందుకు చాచిన చేతిని వెనకవైపు నుంచి లాక్‌ చేస్తుంది. అంటే ముందుకు చాపిన చేతిని మరో చేయ్యి గట్టిగా పట్టుకొని ఉంటుంది. అలా పట్టుకున్న వెంటనే ముం‍దుకు చాచిన చేతితో పంచ్‌ ఇవ్వడానికి వచ్చినట్లు ముందుకు తెస్తుంది. ఈ వీడియో చూసినప్పుడు కాస్తా గందరగోళంగా అనిపించడమే కాక ప్రయత్నించినప్పుడు కూడా అంత సులువుగా చేయలేకపోతున్నామంటున్నారు నెటిజన్లు. ఈ వీడియోను చిడెరా కెమకోలమ్‌ అనే ఓ ట్విట్టర్ యూజర్ ఆగస్టు 22 న పోస్ట్ చేసింది. ఈ వెరైటీ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు 3.3 మిలియన్ల మంది ఈ వీడియోను చూశారు. ఈ వీడియోను చూసిన వాళ్లు ఊరికే ఉంటారా? ఉండరు. అందుకే వాళ్లు ట్రై చేసిన వీడియోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. మీరు ఈ వీడియో చూసి ఓ సారి ప్రయత్నించండి.