‘హ్యాపీ వెడ్డింగ్’ కు ముఖ్య అతిథిగా రాంచరణ్!
Spread the love

మెగా ఫ్యామిలీ నుండి కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేసిన మెగా హీరో నాగబాబు కూతురు నిహారిక కొణిదెల నటిస్తున్న తాజా చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’…. సుమంత అశ్విన్ హీరోగా యువీ క్రియేషన్స్ మరియు పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి లక్ష్మన్ కార్య దర్శకత్వం వహించారు. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది…. ఈ నెల 28 న సినిమా విడుదల సందర్భంగా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ఫంక్షన్ కి ఎవరు ముఖ్య అతిథిగా వస్తున్నారు అనేదే ఆసక్తికరం .

ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూలై 21న ఘనంగా నిర్వహించనున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్వంత బ్యానర్ యువి క్రియేషన్స్ కావడంతో ఆయనే వస్తారు అని కొంతమంది భావించారు. ఇప్పటి వరకు ఈ సంస్థ నిర్మించిన చాలా ఫంక్షన్ లకి ప్రభాస్ హాజరయ్యారు. అయితే నిహారిక-ప్రభాస్ ల పెళ్లి అంటూ కొద్ది రోజులు వార్తలు రావడంతో ప్రభాస్ ఈ ఫంక్షన్ కి దూరంగా ఉన్నట్లు అనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా హాజరై అలరించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అన్నివర్గాల ప్రేక్షకులు ఆసక్తితో వున్నారు. ఆహ్లాదకరమైన కథా నేపథ్యంలో సాగే ఓ చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చూడనున్నామని భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఆ అంచనాలను ఎంతవరకూ అందుకుంటుందో ….. చూడాలి.

Charan special guest for Happy Wedding pre-release event