బొబ్బలి పులిలా ఎదురు తిరుగుతా…
Spread the love

ఆంధ్రప్రదేశ్‌కు ఇదే పరీక్షా కాలమని.. కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి కోసం పోరాటం కొనసాగిస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఇవాళ విశాఖపట్నం జిల్లా తగరపువలసలో ఆయన మాట్లాడుతూ తనకు అభివృద్ధి చేసే శక్తి దేవుడు ఇచ్చాడని అన్నారు. అన్యాయం చేస్తే బొబ్బిలి పులిలా తిరుగుబాటు చేస్తామని చెప్పారు. ‘కేసులకు భయపడి వైసీపీ లాలూచీ పడింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ నివేదికపై పవన్ కల్యాణ్‌ ఎందుకు మాట్లాడరు? జగన్, పవన్, కేసీఆర్‌ను మనపై మోడీ ఎగదోస్తున్నారు. ప్రత్యేక హోదా వద్దన్న పార్టీని పవన్, జగన్ ఎలా సమర్థిస్తారు? విభజన హామీలపై వైసీపీ, జగన్ ఎందుకు ప్రశ్నించరు?’ అని అన్నారు. జగన్‌, పవన్‌లకు మోడీ దయాదాక్షీణ్యాలు కావాలన్న బాబు.. లాలూచీ రాజకీయాలు చేసేవారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు.