నెల్లూరులో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు
Spread the love

రాత్రి 8 గంటలు దాటలేదు…నిత్యం జన సంచారం.. వాహనాలతో రద్దీ ఉండే ఆత్మకూరు బస్టాండుకు సమీపంలోనే ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసారు. రంగనాయకుపేల గేటు నుంచి ఆత్మకూరు బస్టాండు వైపు వస్తున్న మార్గంలో సరిగ్గా అండర్‌ బ్రిడ్జి కింద బస్టాండుకు వెళ్లే దారిలో ఈ హత్య చేసారు.

స్థానికుల సమాచారం మేరకు నెల్లూరు శిరీష్‌ కుమార్‌ హత్యకు ముందుగానే వ్యూహం రచిం చినట్టు తెలుస్తోంది. శిరీష్‌కుమార్‌ ఫ్లైవోవర్‌ కిందకు రాగానే ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తు లు ముసుగులు ధరించి బీరు సీసాలు, రాడ్డుతో శిరీష్‌ వెనుక వైపు గట్టిగా మోది హత్య చేసిన ట్లు సమాచారం. శిరీష్‌కుమార్‌ వాహనంపై నుంచి ఒరిగిన వెంటనే వారు నెంబరు ప్లేట్లు లేని వాహనాలతో వెంకటేశ్వరపురం వైపు వెళ్లినట్లు తెలిసింది. పడుగుపాడు ప్రాంతంలోని ఆర్టీసీ జోనల్‌ కా ర్యాలయం వెనుక భాగంలో ఉన్న ఇంద్రలోక్‌ ఎ వెన్యూలో బిల్డర్‌ నెల్లూరు శిరీష్‌ (37) నివసిస్తున్నాడు. తొలి నుంచి శిరీష్‌ బిల్డర్‌గా జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం  నాడు రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయల్దేరిన శిరీష్‌ టౌ న్‌కు వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులతో చెప్పాడు. సరిగ్గా 8.30 గంటలకు పోలీసుల నుంచి శిరీష్‌ కుటుంబ సభ్యులకు ఫోన్‌ వచ్చింది. శిరీష్‌కు ప్రమాదం జరిగిందని పెద్దాసుపత్రికి రావాలని సూచించారు. దీంతో పరుగులు తీస్తూ కుటుంబ సభ్యులు పెద్దాసుపత్రికి చేరుకున్నారు. 7.30 గంటలకు ఇంటి నుంచి బయల్దేరిన శిరీష్‌ ఆత్మకూరు బస్టాండు ఫ్లైవోవర్‌ బ్రిడ్జి వద్దకు వచ్చే సరికి 7.50 నుంచి 8 గంటల అయి ఉంటుంది.

హత్య జరిగిన ప్రాంతంలో బీరు బాటిళ్లతో హత్యచేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతదేహాన్ని గమనించిన ట్రాఫిక్‌ పోలీసులు నవాబుపేట పోలీసుసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి నవాబుపేట పోలీసుస్టేషన్‌ సీఐ చేరుకుని మృతదేహాన్ని 108 ద్వారా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.