మరోసారి బరితెగించిన పాక్…
Spread the love

సరిహద్దుల్లో మరోసారి పాకిస్థాన్ సైన్యం బరితెగించింది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కశ్మీర్‌ సహా సరిహద్దుల్లో కాల్పుల విరమణ పాటిస్తోన్న సైన్యంపై పాక్ దాడి చేసింది. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌కు చెందిన ఓ అసిస్టెంట్ కమాండెంట్, ఎస్ఐ సహా ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూలోని చంబిలియాల్ సెక్టార్, కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో బుధవారం ఉదయం పాకిస్థాన్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా కాల్పులకు దిగింది. జమ్మూకశ్మీర్‌ సాంబా జిల్లాలోని చామ్‌లియాల్‌ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దుల్లో మీదుగా పాక్‌ మంగళవారం రాత్రి కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు మృతిచెందారు.

జూన్ 3 న పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అఖ్నూర్ సెక్టార్లోని ప్రగ్వాల్ ఏరియాలో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు పాల్పడటంతో బీఎస్ఎఫ్ దళాలకు చెందిన ఏఎస్ఐ, జవాన్ అమరులయ్యారు. కాల్పుల విరమణ పాటిద్దామని హాట్ లైన్ ద్వారా పాకిస్థాన్ డీజీఎంవో మే 29న చేసిన ప్రతిపాదనకు భారత డీజీఎంవో అంగీకరించింది. ఈ ప్రతిపాదన తెచ్చిన నాలుగు రోజుల్లోనే పాక్ తన దురాగతాన్ని బయటపెట్టుకుంది.

భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహన్, పాకిస్థాన్ డీజీఎంవో మేజర్ జనరల్ సాహిర్ మీర్జాలు ఇటీవలే సరిహద్దుల వెంబడి పరిస్థితిని సమీక్షించారు. కాల్పుల విరమణ పాటించాలనే నిర్ణయానికి వచ్చారు. మే 15, 23 తేదీల్లో జమ్మూ, కథువా, సాంబా సెక్టార్లలోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కాల్పులకు పాల్పడింది. దీంతో వేలాది మంది సరిహద్దుల నుంచి దూరంగా తరలి వెళ్లారు. పాక్ కాల్పుల్లో ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు సహా 12 మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. ప్రతీకారంతో రగిలిన భారత బలగాలు విరుచుకపడి పాక్‌ సైన్యంపై దాడిచేసి వారి వెన్నులో వణుకు పుట్టించాయి.

ఈ క్రమంలో ఎనిమిది గంటల పాటు భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ నెలలో పాక్‌సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవటం ఇది రెండో సారి. పది మంది పౌరులు గాయపడ్డారు.  ఆ సందర్భంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అయితే రోజులు గడవక ముందే పాక్ బలగాలు కవ్వింపు చర్యలకు దిగారు.