మేనిఫెస్టో విజన్‌ డాక్యుమెంట్‌ను విస్తృత ప్రచారం చేయాలనీ జనసేనని ఆదేశం…
Spread the love

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టో విజన్‌ డాక్యుమెంట్‌ను ప్రజలకు మరింత చేరువగా తీసుకువెళ్ళాలని పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ ని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ గారు ఆదేశించారు.  12  అంశాలతో కూడిన విజన్‌ డాక్యుమెంట్‌ను ఈనెల 14న పవన్‌ కళ్యాణ్‌ గారు విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. ఉచిత గ్యాస్‌ సిలిండర్‌,  రేషన్‌కు బదులు రూ.2500 నుంచి 3500 నగదు,  మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ లాంటి పథకాలు ప్రకటించారు. ఈ హామీలు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలందికీ తెలిజేయల్ల్సిన  అవసరం ఉందని పవన్‌ కళ్యాణ్‌ భావిస్తున్నారు.

వచ్చేనెల 12 నుంచి శాసనసభ ఎన్నికల వరకు వీటిని ప్రచారం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు అందరికి తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంపై ఒక ప్రణాళిక రూపొందించి పార్టీ జిల్లా కమిటీలతో చర్చించాలని బుధవారం సమావేశమైన ప్యాక్‌ నిర్ణయించారు. జిల్లా కమిటీల అభిప్రాయం మేరకు కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించరని ప్యాక్‌ కన్వీనర్‌ మాదాసు గంగాధరం తెలియజేసారు. ఈ డాక్యుమెంట్‌ ప్రచారంలో పార్టీ శ్రేణులను భాగస్వామ్యులను చేయ నున్నట్టు చెప్పారు.