ఇక పై హుక్కా పార్లల్లు  బంద్ ..సర్కారు ఉత్తర్వులు జారీ !!
Spread the love

ముంబై : ఇక ఇప్పుడు మహారాష్ట్రలో హుక్కా పార్లర్లను నిషేధిస్తూ ఆ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మహారాష్ట్ర సర్కారు శాసనసభలో చేసిన తీర్మానానికి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. హుక్కా పార్లర్ల నిషేధం ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని సర్కారు తెలియజేసింది. ఈ నిషేధంతో దేశంలో గుజరాత్ తర్వాత హుక్కాపార్లర్లను నిషేధించిన రెండో రాష్ట్రంగా మహారాష్ట్ర నిలచింది. హుక్కా పార్లర్ల నిషేధాన్ని ఉల్లంఘిస్తే లక్షరూపాయల జరిమానా విధిస్తామని హోంమంత్రిత్వశాఖ అధికారులు హెచ్చరించారు. మొదట మహారాష్ట్ర సర్కారు హుక్కా పార్లర్లను నియంత్రించాలని భావించింది.

అయితే గత ఏడాది కమలామిల్స్ లో జరిగిన అగ్నిప్రమాదం అనంతరం హుక్కాపార్లర్లపై పూర్తిగా నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో హుక్కా పార్లర్లపై విధించిన నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కేన్సర్ చికిత్స నిపుణులు, పొగాకు వ్యతిరేక ఉద్యమకారుడు డాక్టర్ పంకజ్ చతుర్వేది కోరారు.