అంబానీ  కుటుంబం లో పెళ్లి  అమెరికన్ పాప్ గాయని బియాన్స్  స్టెప్పులు!!
Spread the love

ఊరంత పందిరేసి.. వీధినిండా సీరియల్ దండలు వెలిగించి.. డూండూండూం మోగించాలా రాజుగారి పెళ్లికి? అలా చేస్తే అది పాత చింతకాయ పెళ్లి అనిపించుకోదూ? అందుకే ఏకంగా ఉదయ్ పూర్ ప్యాలెస్ నే బుక్ చేశారు అంబానీలు. ఉదయ్ పూర్ నగరాన్నే పెళ్లి పందిరిగా మార్చేశారు. అక్కడికి ఏకంగా ముంబై నుంచి సెలబ్రిటీ ఇళ్లన్నీ ఖాళీ చేయించి మరీ తరలించారు. వీళ్ల విమానం టిక్కెట్ల కోసమే కొన్ని కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. కింగ్ ఖాన్ షారూక్- సల్మాన్- అమీర్ ఖాన్ సహా ఇండస్ట్రీ బెస్ట్ సెలబ్రిటీలంతా ఈ పెళ్లిలో సందడి చేశారు. బాలీవుడ్ హాట్ దివాస్ స్పెషల్ అప్పియరెన్సులతో సంగీత్ కార్యక్రమాన్ని వేడెక్కించారు. వీళ్లతో పాటే అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్యామణి హిల్లరీ క్లింటన్ ఈ పెళ్లి వేడుకకు ఎటెండ్ అయ్యి.. ఉదయ్ పూర్ వీధుల్లో షికార్లు చేయడం చర్చకొచ్చింది.

అదంతా అటుంచితే ఈ సంగీత్ లో అమెరికన్ పాప్ గాయని బియాన్స్ వేసిన స్టెప్పులు గానాలాపన సెలబ్రిటీలకే మతిచెడే ట్రీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బియాన్స్ ఒళ్లంతా విరుచుకుని పెళ్లి మంటపాన్ని ఇరగకుమ్మేయడం వీడియోల్లో కనిపిస్తోంది. సెలబ్రిటీలే కళ్లప్పగించి మరీ చూశారు ఈ వేడుకను. అదంతా సరే.. బియాన్స్ బృందం అమెరికా నుంచి ఉదయ్ పూర్ లో దిగి ఈ వేడుకను ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు వరల్డ్ రిచెస్ట్ గయ్ అంబానీ ఎంత చెల్లించారు? అంటే కళ్లు భైర్లు కమ్మే పైకమే పారితోషికంగా అందించారని తెలుస్తోంది. బియాన్స్ బృందానికి అమెరికా టు ఉదయ్ పూర్ విమానం టిక్కెట్లు బుక్ చేయడమే కాకుండా అన్ని ఏర్పాట్లు చూసుకునేందుకు భత్యం చెల్లింపులు కలిపి ఏకంగా రూ.20 కోట్లు ఖర్చయిందని చెబుతున్నారు. ఆ మేరకు ప్రముఖ ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 20కోట్లు కేవలం బియాన్స్ ట్రూప్ డ్యాన్సుల కోసం ఖర్చు చేశారంటే ఈ పెళ్లి వేడుకకు మొత్తం ఎంత ఖర్చు చేస్తున్నారో ఊహించనలవి కాదేమో! బాప్రే.. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? డబ్బులకు కొదవా? ప్రపంచంలోనే 19వ అతిపెద్ద ధనవంతుడిగా ముఖేష్ అంబానీ పేరు మార్మోగుతోంది. ఆ మేరకు ఫోర్బ్స్ అతడి ఆస్తుల వివరాల్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలోని 27 అంతస్తుల బిల్డింగ్ లో నివశించే ముఖేష్ అంబానీ 44 బిలియన్ డాలర్ల నెట్వర్త్ ని కలిగి ఉన్న ధనవంతుడు. ఈ పెళ్లికి విసిరేసింది అందులో పిసరంతేలే! అంటూ చెణుకులు విసురుతున్నారంతా. ఇక పెళ్లికొడుకు ఆనంద్ పిరమాళ్ ఆస్తులు 4 మిలియన్ డాలర్ల  కలిగి ఉన్నాయట. అంటే అంబానీ అంతకంటే ఎన్ని రెట్లు గొప్పవాడో అర్థం చేసుకోవాలి మన అందరం.