
ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. తెలంగాణలో ప్రజా కూటమి తరపున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.ఓల్డ్ బోయిన్పల్లిలో ప్రచారంలో భాగంగా ప్రసంగ౦ మధ్యలో మహ్మద్ ఇక్బాల్ రాసిన దేశభక్తి గేయం సారే జహాసె అచ్చాను… పాడలేక నవ్వులపాలయ్యారు.
ప్రసంగ౦ లో బాలకృష్ణ తన హిందీ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించారు.‘సారే జహాసె అచ్ఛా.. హిందుస్తాన్ హమారా హమారా.. అంటూ కొనసాగించిన బాలయ్య.. ఆ తర్వాత ఏం పాడాలో గుర్తుకురాక ‘హమ్ బుల్ బులే హై ఇస్కే’ ఆలపించకుండానే హే బుల్ బుల్.. హే బుల్ బుల్ సితార హమారా అని పాడారు.
గతంలో కూడా బాలకృష్ణ ఇలా ఎన్నోసార్లు ఏదో ఒకటి ప్రసంగించి అడ్డంగా దొరికిపోయారు.ఇప్పుడు తాజాగా సారే జహాసె హచ్చాను కూనీ చేశారని,బుల్ బుల్ బాలయ్య ఇక చాలయ్య అంటూ నెటిజన్లు ఆటాడుకుంటున్నారు.