ఏపీ ఎస్సై ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
Spread the love

ఆంధ్రప్రదేశ్‌ ఎస్సై ప్రాథమిక పరీక్షల ఫలితాలను పోలీస్‌ నియామక మండలి ఛైర్మన్‌ కుమార్‌ విశ్వజిత్‌ బుధవారం (డిసెంబరు 26) విడుదల చేశారు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలకు 51,926 మంది అర్హత సాధించారని ఆయన తెలిపారు. గురువారం నుంచి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో ఓఎంఆర్‌ పేపర్స్‌ను అందుబాటులో ఉంచుతామని ఆయన వెల్లడించారు. ఈనెల 28 నుంచి 30 వరకు అభ్యర్థుల సందేహాలను స్వీకరిస్తామని, జనవరి 18 నుంచి ఫిజికల్‌ టెస్ట్‌లు నిర్వహిస్తామని తెలిపారు. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు నగరాల్లో ఫిజికల్‌ టెస్ట్‌లు జరుగుతాయన్నారు. కమిషన్‌ ప్రతిపాదించిన పాఠ్యప్రణాళికకు కూడా ఆమోదం తెలిపింది. గ్రూపు-1 ప్రకటనతోపాటు అధ్యాపకులు, ఇతర ఉద్యోగాల భర్తీ ప్రకటనలను 31లోగా జారీ చేస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. గురువారం గ్రూపు-2 ప్రకటన వెలువడవచ్చు.