అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ 5 రోజుల్లోనే రూ.15,000 కోట్ల మేర అమ్మకాలు
Spread the love

ఆన్‌లైన్ అమ్మకాలు దుమ్మురేపుతున్నాయి. పండుగ సీజన్ కావడంతో ఈ-కామర్స్ సంస్థలకు కాసుల వర్షం కురుస్తున్నది. గత ఆరు రోజుల్లో రూ.15,000 కోట్ల విక్రయాలు నమోదవగా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. స్మార్ట్‌ఫోన్లు, దుస్తులు, గృహోపకరణాలకు పెద్ద ఎత్తున డిమాండ్ కనిపిస్తున్నదని రెడ్‌సీర్ కన్సల్టింగ్ తమ తాజా నివేదికలో తెలిపారు. ఈ నెల 9-14 మధ్య దాదాపు రూ.15 వేల కోట్ల అమ్మకాలు జరిగాయని, గతేడాది ఇదే వ్యవధిలో రూ.10,325 కోట్లుగానే ఉన్నాయని చెప్పింది.

చిన్న పట్టణాల నుంచీ అధిక గిరాకీ

సాధారణంగా ఇకామర్స్‌ పోర్టళ్లలో కొనుగోళ్లు నగరాల్లో అధికంగా జరుగుతాయని అంచనా. ఈసారి రెండో అంచె పట్టణాల నుంచి మరింత ఎక్కువగా ఆర్డర్లు లభించాయని పోర్టళ్లు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ధరలు తగ్గించడం, కొన్ని ఉత్పత్తులపై ఇచ్చిన ప్రత్యేక ఆఫర్లు, సెల్‌ఫోన్ల వంటివి కొనుగోలు చేసుకున్నప్పుడు, కొంతకాలం గడిచాక, మార్చుకుని, కొత్తది కొనుగోలు చేసుకునేందుకు పాతదానికి అధిక ధర ఇచ్చే పూచీ వంటి లాయల్టీ పథకాల వల్ల కొత్త వినియోగదారులు లభించారని సంస్థలు తెలిపారు. సాధారణ విక్రయశాలల్లో కొనుగోలు చేసేవారు కూడా ఆన్‌లైన్‌ పోర్టళ్లలో ఆర్డర్లు ఇచ్చారని రెడ్‌సీర్‌ పేర్కొంది.