క్యూబాలో విమాన ప్రమాదం
Spread the love

క్యూబాలో రాజధాని హవానాలోని జోస్‌ మార్టి విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం హవానా నుంచి తూర్పు క్యూబాలోని హోల్గున్‌ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. హవానాలోని జోస్‌ మార్టి ఎయిర్ పోర్టు నుంచి బోయింగ్‌ 737 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక్కసారిగా మంటలు చెలరేగి కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.

క్యూబా అధ్యక్షుడు మిగ్యుయెల్ డియాజ్ కానెల్ తెలిపారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఆయన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. హోల్గున్‌కు వెళ్లాల్సిన విమానం బోయ్‌రోస్‌, శాంటియాగో డీ లావెగాస్‌ గ్రామాల మధ్య పొలాల్లో కుప్పకూలిపోయింది. ప్రమాద జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. క్షతగాత్రులను చికిత్స కోసం హవానాలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను అధికారులు గుర్తించే పనిలో ఉన్నట్టు క్యూబా అధ్యక్షుడు డియాజ్ కేనల్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై  అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పారు.

సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఎంతమంది చనిపోయిందీ అధికారికంగా ప్రకటించకపోయినా చాలామంది ప్రాణాలు కోల్పోయారని కానెల్‌ సంతాపం వ్యక్తం చేశారు. చాలామందిని అంబులెన్సుల్లో తీసుకెళ్లడం చూశామని సంఘటన స్థలం వద్ద ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. హవానాకు 20 కి.మీ దూరంలో ఈ ప్రమాదం జరగ్గా.. పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని, తర్వాత ఆకాశంలో దట్టమైన పొగ కమ్ముకుందని విమానం కూలిన ప్రదేశానికి దగ్గర్లో రెస్టారెంట్ నడిపే గిల్బెర్టో మెనెన్డ్‌జ్ తెలిపారు.

ప్రమాదానికి గురైన విమానాన్ని గ్లోబల్ అనే మెక్సికన్ ఎయిర్‌లైన్ నుంచి క్యూబానా ఎయిర్‌లైన్ లీజుకు తీసుకుందని ప్రమాదానికి గురైన బోయింగ్‌ 737-201 విమానం 1979లో తయారైంది. దాన్ని క్యూబన్‌ ఎయిర్‌లైన్స్‌ అద్దెకు తీసుకుని నడుపుతుంది.  అయితే ఎంతమంది చనిపోయిందీ అధికారికంగా ప్రకటించకపోయినా చాలామంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మీ ఎయిర్‌లైన్స్ సేవల పట్ల ఫిర్యాదులు వస్తున్నాయంటూ క్యూబానా ఎయిర్‌లైన్స్‌‌ను ఆ దేశ ఉపాధ్యక్షుడు హెచ్చరించిన మరుసటి రోజే ప్రమాదం జరగడం బాధాకరం.