అమెరికా లో  14 ఏళ్ల పిల్లాడు  గవర్నర్‌ కాబోతున్నాడు ??
Spread the love

వాషింగ్లన్‌ :ప్రస్తుత౦  మన దేశంలో అయితే  14 ఏళ్ల పిల్లాడు అంటే ఓ పది కేజీల పుస్తకాల సంచితో పొద్దున 6 – 7 గంటల ప్రాంతంలో వెళ్తే మళ్లీ రాత్రి ఎప్పుడో 8 గంటల ప్రాంతంలో తిరిగోస్తాడు. ఆదివారాలు, సెలవు రోజుల్లో అయితే ట్యూషన్‌లో కనిపిస్తాడు అని తేలుసు.ఓకవేళ   అది కాకపోతే   టీవీల ముందు కూర్చోని లేదా సెల్‌ఫోన్‌లో చాటింగ్‌ చేస్తూ కనిపిస్తాడు. కానీ గవర్నర్‌ పదవికి పోటీ చేస్తాడా అంటే.. పోటీ కాదు కదా కనీసం ఓటు కూడా వేయలేడు. ఎందుకంటే మన దేశంలో ఓటు హక్కు వయసు 18 ఏళ్లు. మరో అంశం ఏంటంటే గవర్నర్‌ను ఎన్నుకోం.. నియమిస్తారు. ఇది మనదేశంలో పరిస్థితి. కానీ అమెరికాలో మాత్రం రాష్ట్రాల వారిగా గవర్నర్‌లను ఎన్నుకుంటారనే సంగతి మన అ౦దరికి  తెలిసిందే. ప్రస్తుతం వెర్మోంట్‌ రాష్ట్రంలో జరుగుతున్న గవర్నర్‌ ఎన్నికలు కేవలం ఆ రాష్ట్రంలోనే కాక అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయనే చేప్పాలి.

ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఏథాన్ సోన్నేబోన్‌ అనే 14 ఏళ్ల బాలుడు గవర్నర్‌ పదవికి పోటి పడుతున్నాడు. అమెరికా ఈశాన్య రాష్ట్ర రాజ్యాంగ నియమాల వల్ల  ఏథాన్ సోన్నేబోన్‌కు ఈ అవకాశం దక్కిందని తేలుస్తో౦ది. ఈ నియమాల ప్రకారం వెర్మోంట్‌ రాష్ట్రంలో గవర్నర్‌ పదవికి పోటీ చేయాలంటే ఎటువంటి వయో పరిమితి లేదు.అయితే  కానీ ఆ వ్యక్తి వరుసగా నాలుగేళ్లపాటు ఆ ప్రాంతంలో నివాసముండాలి. ఈ నియమం వల్ల ఏథాన్‌ వెర్మోంట్‌ ప్రాంత గవర్నర్‌గా పోటీ చేస్తున్నాడని తేలుస్తు౦ది.

అయితే ఏథాన్‌ అందరిలా సాదాసీదీ పిల్లవాడు కాదు అంటున్నారు అతని మద్దతుదారులు. ఆరోగ్య రక్షణ, ఆర్థికాభివృద్ధి, విద్యారంగాల్లోఅభివుద్ధి కోసం నూతన సంస్కరణలు తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. ఏథాన్‌ ఇప్పటికే క్యాంపేయిన్‌ కూడా ఆరంభించాడు. ఈ విషయం గురించి ఏథాన్‌ ‘మార్పు కోరుకునే వారిలో నేను ముందుంటాను. అందుకే ఈసారి నేను గవర్నర్‌ పదవికోసం పోటీ పడుతున్నాను. వయసు పెద్ద అడ్డంకి కాదు’అని  అన్నారు. ఇతని ప్రత్యర్థిగా క్రిస్టీన్‌ హాల్‌క్విస్ట్‌ పోటీ చేస్తున్నాడు. ఇతని కూడా ప్రత్యేకమైన అభ్యర్దే. ఒకవేళ క్రిస్టీన్‌ ఈ ఎన్నికల్లో గెలిస్తే అమెరికాలో గవర్నర్‌గా విజయం సాధించిన తొలి లింగమార్పిడి వ్యక్తిగా చరిత్ర సృష్టిస్తాడు. అయితే ఏథాన్‌ గవర్నర్‌ పదవి కోసం పోటీ చేయడాన్ని అక్కడి మేధావులు వ్యతిరేకిస్తున్నారు. అతనికి ఉన్న రాజకీయ అనుభవం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.