షిర్డీ సాయి సమాధికి నేటితో 100 సంవత్సరాలు!
Spread the love

భారత దేశం లో ఎంతో మంది ప్రజలు భక్తి శ్రద్ధలతో కొలిచే షిర్డీ సాయిబాబా మహాసమాధి చెంది ఈ రోజు తో 100 సంవత్సరాలు పూర్తయ్యాయి.1918 అక్టోబర్ 15వ తేదీన ఆయన సమాధి అయ్యారు.షిర్డీలో సాయిబాబా దాదాపు 60 సంవత్సరాలు నివసించారు.సాయిబాబా హిందూ, ఇస్లాం రెండు సంప్రదాయాలను పాటించారు.నమాజ్ చదవడం ఖురాన్ ను అధ్యయనం చేయడం వంటి ఆచారాలను ఆయన ప్రోత్సహించారు.రామాయణం,భగవద్గీత,విష్ణు సహస్రనామ స్త్రోత్రాలను పారాయణం చేయాలని సాయిబాబా హిందువులకు సూచించారు.

సాయిబాబాకు మన దేశంలోనే కాకుండా దాదాపు 50 దేశాల్లో 8 వేలకు పైగా ఆలయాలు ఉన్నాయి.మన దేశంలో పద్మనాభస్వామి ఆలయం,తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి దేవస్థానం తర్వాత షిర్డీ సాయిబాబా ఆలయం అత్యంత సంపన్నమైనది.సాయి సంస్థాన్ బ్యాంకు ఖాతాల్లో దాదాపు 1800 కోట్ల వరకు సొమ్ము ఉంది.