ఆకలి పెర‌గాలంటే.. వీటిని తీసుకోవాలి..!
Spread the love

మ‌న‌లో చాలా మందికి ఆక‌లి బాగానే వేస్తుంది. కానీ కొంద‌రికి మాత్రం అప్పుడ‌ప్పుడు ఆక‌లి మంద‌గిస్తుంటుంది. దీనికి అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే కింద సూచించిన ప‌లు ఆహారాల‌ను నిత్యం తీసుకుంటుంటే.. దాంతో జీర్ణ‌క్రియ బాగా జరుగుతుంది. అంతేకాదు, ఆకలి కూడా పెరుగుతుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

  1. జీర్ణక్రియను వేగవంతం చేయడంలో నిమ్మరసం బాగా పని చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలిగించి ఆకలి పుట్టేలా చేస్తుంది. ఆకలి మందగించినపుడు గ్లాసు నీళ్లలో కాస్త నిమ్మరసం పిండి, అందులో కొద్దిగా తేనె కలిపి తీసుకోండి. కాసేపటికి ఆకలి వేస్తుంది.
  2. పోషక విలువ‌లు మెండుగా ఉన్న ఖర్జూరాలకు ఆకలి పుట్టించే గుణం కూడా ఎక్కువే. దీన్ని రసంలా చేసి కూడా తీసుకోవచ్చు. ప్రతి రోజూ నాలుగైదు ఖర్జూరాలు తింటే ఆకలి బాగా పెరుగుతుంది.
  3. వికారం, అజీర్తికి అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. ప్రతి రోజూ నాలుగైదు అల్లం ముక్కలను దవడన పెట్టుకుని నమిలి, ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. దీనివల్ల క్రమంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. ఆకలి కూడా బాగా పెరుగుతుంది.
  4. పొట్టలో ఏర్ప‌డిన‌ గ్యాస్‌ను బయటకు పంపివేయడంలో మెంతులు బాగా పని చేస్తాయి. దాంతో ఆకలి పెరుగుతుంది. ప్రతి రోజూ మెంతిపొడిని తేనెతో కలిపి తగిన మోతాదులో తీసుకుంటే ఆకలి పుడుతుంది.
  5. ద్రాక్షలో విటమిన్‌-సి ఉంటుంది. అది జీర్ణక్రియను సాఫీగా సాగేలా చేస్తుంది. భోజనం చేశాక కొన్ని ద్రాక్షపళ్లు తినండి. తీసుకున్న ఆహారం త్వ‌రగా జీర్ణ‌మ‌వుతుంది. ఆకలి కూడా పెరుగుతుంది.