ఉల్లిగడ్డలు కోసేటప్పుడు ఇలా చేస్తే  కంట్లో నీళ్లు రావు
Spread the love

ఉల్లిగడ్డ లేకుండా కూర చెయ్యడానికి ఎవరూ ఇష్టపడరు. కాని ఇష్టమైన వాటిని తరిగేటప్పుడు కష్టపడుతుంటారు. ఉల్లిగడ్డలు తరిగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కంటి నుంచి నీరు రాకుండా ఉంటుంది.

*ఉల్లిగడ్డలు తరిగే ముందు సగానికి కోసి వాటిని నీటిలో వేయాలి. ఇలా చేస్తే కోసేటప్పుడు కంట్లో నీళ్లు రావు.

*గాలి బాగా ప్రసరించే ప్రదేశంలోనే ఉల్లిగడ్డలను తరుగాలి. అంటే.. ఇంట్లో ఫ్యాన్ కింద కాకుండా వంటగదిలో ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ దగ్గరలో నిల్చుని తరుగడం వల్ల కళ్లు మండకుండా ఉంటాయి.

*ఉల్లిగడ్డలు కోసేముందు కొంతసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉల్లిగడ్డలోని ద్రవరూపంలో ఉన్న రసాయనాలు గడ్డకడుతాయి. ఇలా చేయడం వల్ల ఉల్లిగడ్డ కోసేటప్పుడు కంటి నుంచి నీళ్లు రాకుండా ఉంటాయి.

*ఉల్లిగడ్డలు కోసిన తరువాత గిన్నెలో వేయకుండా చాపింగ్ బోర్డ్ మీదే ఉంచాలి. దానివల్ల రసాయనాలు తక్కువగా విడుదలవుతాయి.

*ఉల్లిగడ్డలను కోసే ప్రదేశంలో కొవ్వొత్తి వెలిగించినా, మండుతున్న గ్యాస్ దగ్గరగా నిలబడి తరిగినా కళ్లు మండే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి.