కొత్తిమీర అన్నం..
Spread the love

కావాల్సిన పదార్ధాలు : రెండు కప్పులు బియ్యం,  ఒక పెద్ద కట్ట కొత్తిమీర , 4 లేదా 6 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, ఆరు రెబ్బలు వెల్లుల్లి, 2 లేదా 3 టమోటాలు , తగినంత ఉప్పు 2 టీ స్పూన్స్ నెయ్యి, 6 లేదా 7 లవంగాలు, 2 లేదా 3 యాలక్కాయలు, 2 ముక్కలు దాల్చిన చెక్క,

తయారు విధానం:  ఒక పాత్ర తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కాగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి ఓ నిముషంపాటు వేయించి, తర్వాత క్రిందకు దించి చల్లార్చుకోవాలి. వేయించిన కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నింటిని పేస్టులా కలగలుపుకోవాలి. ఒకవేళ ఈ మిశ్రమం గట్టిగా వున్నట్లు అనిపిస్తే.. కొద్దిగా నీళ్లు కలుపుకుని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఓ కడాయి తీసుకుని అందులో నెయ్యి వేసి వేయించాలి. నెయ్యి కాగిన తర్వాత అందులో లవంగాలు, యాలక్కాయలు, దాల్చినచెక్కలు వంటి మసాలా దినుసుల్ని వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత కొత్తిమీర పేస్టు వేసి.. కలుపుతూ వేయించాలి. అందులోనే టమోటా ముక్కల్ని కలిపి 5 నిముషాలపాటు వేయించి ఉప్పు కలుపుకోవాలి. అందులో మూడున్నర కప్పుల నీటిని పోసి బాగా మరిగించాలి. ఇది మరుగుతుండగానే ఇదివరకు నానబెట్టిన బియ్యాన్ని వేసి కలియబెట్టుకోవాలి. అన్నం అయ్యేంతవరకు వుంచి తర్వాత క్రిందకు దించేయాలి. కొత్తిమీర అన్నం రెడీ!