మందార పువ్వుల టీతో లివర్ ఆరోగ్యం
Spread the love

మందార పువ్వులతోపాటు ఆ మొక్కకు చెందిన పలు ఇతర భాగాల నుంచి సేకరించిన పదార్థాలతో మందార పువ్వుల టీ పొడిని తయారు చేస్తారు. ఈ టీని ప్రస్తుతం మనం మార్కెట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ మందార పువ్వుల టీ పొడితో కోల్డ్, లేదా హాట్ టీ పెట్టుకుని తాగవచ్చు. దీనితో అనేక లాభాలు కలుగుతాయి.

మందార పువ్వుల టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని కణజాలాన్ని రక్షిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

మందార పువ్వుల టీని రోజూ తాగడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. రక్త సరఫరా పెరుగుతుంది.

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు మందాపువ్వుల టీ తాగాలి. ఇందులో ఉండే ఔషధ గుణాలు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతాయి.

లివర్ సమస్యలు ఉన్నవారు మందార పువ్వుల టీ తాగితే ఎంతో మంచిది. లివర్‌లో ఉన్న కొవ్వు కరుగుతుంది. లివర్ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

మందార పువ్వుల టీని రోజూ తాగడం వల్ల బరువు తగ్గవచ్చని పలు అధ్యయనాలు కూడా వెల్లడిస్తున్నాయి. అలాగే క్యాన్సర్లను అడ్డుకునే శక్తి కూడా ఈ టీకి ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.