కందగడ్డలతో కిడ్నీ సమస్యలు దూరం..!
Spread the love

కందగడ్డలతో కిడ్నీ సమస్యలు దూరం..!

ఈ సీజన్‌లో మనకు కంద గడ్డలు ఎక్కువగా లభిస్తాయి. వీటినే కొన్ని ప్రాంతాల్లో చిలగడ దుంపలు, గెనుసు గ‌డ్డ‌లు అని పిలుస్తారు. ఇంగ్లిష్‌లో వీటిని స్వీట్ పొటాటోలని అంటారు. ఏ పేరుతో పిలిచినా వీటిని తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కంద గడ్డల్లో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. అందువల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. విటమిన్ సి కూడా వీటిల్లో ఎక్కువగానే ఉంటుంది. ఇది శరీరంలో చేరే హానికారక వైరస్‌లను నాశనం చేస్తుంది. అలాగే ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచుతుంది.

కందగడ్డలను తరచూ తినడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. తద్వారా రక్తం బాగా తయారవుతుంది. దాంతో పాటు జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు కందగడ్డలను తినాలి. వీటిల్లో ఉండే పొటాషియం వాపులను తగ్గిస్తుంది. మూత్రపిండాలకు మేలు చేస్తుంది. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు నిత్యం కందగడ్డలను తినడం ఉత్తమం.

కందగడ్డల్లో ఉండే కెరోటినాయిడ్లు, బీటా కెరోటిన్లు, విటమిన్ ఎ కంటి సమస్యలను దూరం చేస్తాయి.

హైబీపీ, డయాబెటిస్ ఉన్నవారు కందగడ్డలను తినడం మంచిది. అధిక బరువును తగ్గించడంలోనూ ఇవి పనిచేస్తాయి.