జామపళ్లను ‘మేలైన ఫలాలుగా’ పేర్కొనవచ్చు
Spread the love

జామపళ్లను ‘మేలైన ఫలాలుగా’ పేర్కొనవచ్చు. ఎందుకంటే వీటిలో విటమిన్‌ ‘ఏ’ మరియు విటమిన్‌ ‘సి’ నిల్వలు అధికంగా ఉంటాయి. వీటి గింజలు కూడా ఒమేగా-3, ఒమేగా-6 కరుగని కొవ్వు ఆమ్లాలు, పీచు పదార్థాలు ఎక్కవగా కలిగి ఉంటాయి. ఒక జామపండులో విటమిన్‌ ‘సి’ నిల్వలు ఒక నారింజపండులో కన్నా నాలుగురెట్లు అధికంగా ఉంటాయి. వీటిలో మిన రల్స్‌, పొటాషియం, మెగ్నీషియం నిల్వలు అధిక మొత్తాలలో ఉండి సాధారణంగా అవసర మైన పోషకాలు తక్కువ కేలరీలలో ఉంటాయి. జామపళ్లలో ఉండే కెరటోనాయిడ్లు, పొలీఫెనాల్స్‌- ఇవి ఆక్షీకరణం కాని సహజరంగు కలిగించే గుణాలు ఈ పళ్లకి ఎక్కువ ఏంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలను కలుగజేస్తాయి.

ఔషధపరమైన ఉపయోగాలు నాటు వైద్యంలో 1950 సంవత్సరం నుంచి జామ ఆకులు వాటిలోని విభాగాలు, ఔషధ లక్షణాలు పరిశోధ నలలో అంశంగా ఉన్నాయి. జామ ఆకులు, బెరడు నుంచి తయారు చేసిన పదార్థాలు కేన్సర్‌, బాక్టీరియా ద్వారా వచ్చే అంటు వ్యాధులు, వాపులు మరియు నొప్పి నివారణలో వైద్యంగా వాడుతున్నారు.

ఈ జామాకుల నుంచి తయారు చేసిన నూనెలు కేన్సర్లు కి విరుద్ధంగా పనిచేస్తున్నాయి. ఈ జామ ఆకులను నాటు వైద్యంగా డయేరియాకి మందుగా ఉపయోగిస్తారు. బెరడు ఏంటీ మైక్రోబియల్‌, ఏస్ట్రింజంట్‌ లక్షణాన్ని కలిగి ఉంటుంది. వీటిని చక్కెర వ్యాధి తగ్గించడంలో కూడా ఉపయోగిస్తారు.

ఉపయోగాలు :

వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది . శక్తివంతమైన యాంటి ఆక్షిడేంట్ గా ఉపయోగపడుతుంది, కణజాలము పొరను రక్షిస్తుంది, కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది,

కమలా పండులో కంటే ఇదు రెట్లు అధికంగా విటమిను ” సి ” ఉంటుంది . ఆకుకూరలలో లభించే పీచు కంటే రెండింతలు పీచు జామకాయలో ఉంటుంది .

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమయ్యే ” కొల్లాజన్ ” ఉత్పత్తికి ఇది కీలకము, కొవ్వు మెటబాలిజాన్ని ప్రభావితం జేసే ” పెక్టిన్” జామలో లభిస్తుంది . ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది .

జామలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు . జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం ఆరగించవచ్చు. నీటిలో కరిగే బి. సి. విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు. ఇక జామపండు పై చర్మంలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది.

జామకాయలో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం నివారించబడుతుంది. బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్థం ఎక్కువగా ఉండటంతో ఇది సుగర్ వ్యాధికి చక్కటి ఔషధం .

అలాగే జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు.

పోషక విలువలు ప్రతి వంద గ్రాములకు

నీరు: 81.7 గ్రా: కొవ్వు. 0.3 గ్రా. ప్రోటీన్ 0.9 గ్రా పీచు పదార్తాలు: 5.2 గ్రా. సి.విటమిన్ 212 మి.గ్రా. పాస్పరస్. 28 మి.గ్రా సోడియం 5.5 మి.గ్రా పొటాసియం: 91 మి.గ్రా. కాల్సియం: 10 మి.గ్రా ఇనుము; 0.27 మి.గ్రా. శక్తి: 51 కిలో కాలరిలు.