స్ట్రాబెర్రీలను తరచూ తింటే కలిగే అద్భుతమైన లాభాలు..!
Spread the love

ఆకర్షణీయమైన ఎరుపు రంగులో, చూడగానే నోరూరించే స్ట్రాబెర్రీలను తినేందుకు ఎవరైనా ఇష్టపడతారు. స్ట్రాబెర్రీలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇక వీటిని జామ్‌లు, స్మూతీలు, మిల్క్ షేక్స్, ఐస్ క్రీములు, సౌందర్య సాధనాల్లో విరివిగా ఉపయోగిస్తారు. ఎందుకంటే స్ట్రాబెర్రీలలో ఉండే పోషక గుణాలు అలాంటివి మరి. అందుకనే వీటిని మనం నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. స్ట్రాబెర్రీలను తరచూ తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. స్ట్రాబెర్రీలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి స్ట్రాబెర్రీలు బాగా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల అధికంగా క్యాలరీలు ఉండే ఆహారాల పట్ల విముఖత చూపుతారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. తద్వారా ఆహారం తీసుకోవడంపై నియంత్రణ ఉంటుంది. దీంతో బరువు తగ్గవచ్చు.
  2. స్ట్రాబెర్రీలను 100 గ్రాములు తీసుకున్నా కేవలం 33 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. అందువల్ల క్యాలరీలు బాగా లభిస్తాయనే దిగులు లేకుండా నిర్భయంగా వీటిని రోజూ తీసుకోవచ్చు.
  3. జీర్ణ సమస్యలతో సతమతమయ్యే వారు స్ట్రాబెర్రీలను తింటే మంచి ఫలితం ఉంటుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్దకం, అసిడిటీ తదితర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
  4. బరువును నియంత్రించే హార్మోన్ల పనితీరును క్రమబద్దీకరించే ఎల్లాజిక్ యాసిడ్ స్ట్రాబెర్రీలలో పుష్కలంగా ఉంటుంది. అందువల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
  5. స్ట్రాబెర్రీలలో ఆంథోసయనిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అడిపోనెక్టిన్ అనబడే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్ మన శరీర మెటబాలిజాన్ని నియంత్రిస్తుంది. ఇది బరువు తగ్గేందుకు పనిచేస్తుంది.