కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహారం ఇదే
Spread the love

*కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహారం ఇదే.

❇ *మన శరీరంలో మూత్రపిండాలు పోషించే పాత్ర ఏమిటో అందరికీ తెలిసిందే. రక్తం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో, శరీరంలో ద్రవాల స్థాయిలను నియంత్రించడంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి.*  ❇ *మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తేనే ఇతర అన్ని అవయవాల్లో వ్యర్థాలు పేరుకుపోకుండా ఉంటాయి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ క్రమంలో కింద సూచించిన ఆహారాన్ని తరచూ తీసుకుంటే తద్వారా మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మరి క్నిడీలు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!*

*1. ఎరుపు క్యాప్సికం*

ఎరుపు రంగు క్యాప్సికంలో విటమిన్ సి, ఎ, బి6 తదితర పోషకాలుంటాయి.

ఇవి మూత్రపిండాల ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. ఈ క్యాప్సికంను సలాడ్లలో తింటే మంచి ఫలితం ఉంటుంది.

*2. క్యాబేజీ*

క్యాబేజీలో పైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వంటి రోగాలను రాకుండా చేస్తాయి. అలాగే క్యాబేజీలో ఉండే పీచు పదార్థం, విటమిన్ బి6, కె, సి, ఫోలిక్ యాసిడ్ తదితర పోషకాలు మూత్రపిండాలను సంరక్షిస్తాయి.

*3. వెల్లుల్లి*

వెల్లుల్లిలో డైయురెటిక్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల వెల్లుల్లిని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే మూత్రపిండాల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. కిడ్నీల్లో పేరుకుపోయే వ్యర్థాలను వెల్లుల్లి బయటకు పంపేస్తుంది. అందువల్ల కిడ్నీలు ఎప్పుడూ శుభ్రంగా ఉంటాయి.

*4. కాలీఫ్లవర్*

మూత్రపిండాల ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు కాలీఫ్లవర్ కూడా పనికొస్తుంది. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్, ఫైబర్ మూత్రపిండాలను శుభ్రం చేస్తాయి. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నవారు కాలీఫ్లవర్‌ను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

*5. పాలకూర, పచ్చి బఠానీలు*

పాలకూరలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అలాగే పచ్చి బఠానీలలో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇవి రెండూ మూత్రపిండాలను శుభ్రంగా ఉంచుతాయి. మూత్రనాళాల్లో అవసరమైన కణజాల ఉత్పత్తికి ఇవి ఎంతగానో దోహదపడతాయి. దీని వల్ల మూత్రపిండాల ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

https://www.facebook.com/groups/514312172094040/permalink/927543367437583/