వంటింటి ఔష‌ధాలు..!
Spread the love

ప్ర‌స్తుత త‌రుణంలో అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌శైలి కార‌ణంగా చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. వాటిల్లో జీర్ణ స‌మ‌స్య‌లు కూడా ఉన్నాయి. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి త‌దిత‌ర జీర్ణ స‌మ‌స్య‌ల‌తో చాలా మంది స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. కాబట్టి వీటికి ఇంగ్లిష్ మెడిసిన్ వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి అందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

అల్లం వలన ఉపయోగపడే

భార‌తీయులు త‌మ త‌మ ఇండ్ల‌లో ఎంతో కాలం నుంచి అల్లంను అనేక ర‌కాలుగా వాడుతున్నారు. అనేక ర‌కాల వంట‌ల్లో అల్లాన్ని వారు ఉప‌యోగిస్తున్నారు. జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ అల్లం అమోఘంగా పనిచేస్తుంది. నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక‌టి రెండు టీస్పూన్ల అల్లం ర‌సంను తాగుతుంటే జీర్ణ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

న‌ల్ల మిరియాలు వలన ఉపయోగపడే

రుచికి మిరియాలు చాలా ఘాటుగా ఉంటాయి. కానీ వీటిలో బోలెడు ఔష‌ధ గుణాలు ఉంటాయి. మిరియాల‌ను పొడిలా చేసి పాల‌లో క‌లుపుకుని తాగితే అజీర్తి, గ్యాస్ వంటివి త‌గ్గుతాయి