మలబద్దకం నెయ్యితో చెక్..!
Spread the love

మన దేశంలో ఎంతో పురాతన కాలం నుంచి నెయ్యిని ఆహార పదార్థంగానే కాక ఆయుర్వేదంలో పలు ఔషధ తయారీలో, పలు అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ ఉపయోగిస్తున్నారు. నెయ్యిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఎ, బ్యుటీరిక్ యాసిడ్, ఆరోగ్యకరమైన కొవ్వులు నెయ్యిలో ఉంటాయి. నెయ్యిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. నెయ్యి వల్ల మన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ క్రమంలోనే నెయ్యితో ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ రాత్రి పూట నిద్రించేముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒకటి లేదా రెండు టీస్పూన్ల నెయ్యి బాగా కలుపుకుని తాగితే మలబద్దకం దూరమవుతుంది. జీర్ణసమస్యలు ఉండవు. తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. అలాగే మనం తిన్న ఆహారంలో ఉన్న పోషకాలను కూడా శరీరం బాగా గ్రహిస్తుంది.
జలుబు, ముక్కు దిబ్బడను తగ్గించడంలో నెయ్యి అమోఘంగా పనిచేస్తుంది. ఉదయాన్నే కొద్దిగా నెయ్యి తీసుకుని వేడి చేసి కొన్ని చుక్కల నెయ్యిని ముక్కులో పోయాలి. దాంతో తక్షణమే ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలుగుతుంది.

  1. రోజూ రాత్రి భోజనంలో 1 లేదా 2 టీస్పూన్ల నెయ్యిని తీసుకుంటుంటే పొట్ట తగ్గుతుంది. అధిక బరువు తగ్గుతారు.
    డయాబెటిస్ ఉన్నవారు కూడా నిక్షేపంగా నెయ్యిని తీసుకోవచ్చు. భోజనంలో నెయ్యిని తీసుకోడం వల్ల దాని గ్లయిసీమిక్
  2. ఇండెక్స్ తగ్గుతుంది. దాంతో ఆహారం తిన్నాక రక్తంలో బ్లడ్ షుగర్ స్థాయిలు అంతగా పెరగవు. చాలా ఆలస్యంగా ఆ స్థాయిలు పెరుగుతాయి. దాంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
  3. రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, ఒక టీస్పూన్ పసుపు, తగినంత నీరు కలిపి మిశ్రమంగా చేసి ఆ ప్యాక్‌ను ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాలు ఆగాక చల్లని నీటితో కడిగేయాలి. వారానికి ఇలా రెండు సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. చర్మ సౌందర్యం పెరుగుతుంది.
  4. నెయ్యి సమర్థవంతమైన హెయిర్ కండిషనర్‌గా కూడా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌లను కలిపి జుట్టుకు రాయాలి. 20 నిమిషాలు ఆగాక నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే వెంట్రుకలు మృదువుగా మారుతాయి. ఈ మిశ్రమంలో నిమ్మరసం కలిపితే చుండ్రును కూడా తగ్గించుకోవచ్చు.
  5. నెయ్యిని కొద్దిగా తీసుకుని వేడి చేసి దాన్ని పెదాలపై రాయాలి. రాత్రి పూట నిద్రించడానికి ముందు ఇలా చేయాలి. ఉదయం వరకు పెదవులు మృదువుగా మారుతాయి. పెదవులు పగలకుండా ఉంటాయి.