ఎముకలు దృఢంగా మారాలంటే..?
Spread the love

వాత దోషం వల్ల ఎముకల్లో పటుత్వం తగ్గి వాటి లోపలి భాగం గుల్లగా మారుతుంది. దాంతో ఆస్టియోపోరోసిస్ వస్తుందని ఆయుర్వేదం చెబుతున్నది. ఈ వ్యాధి బారిన పడ్డ వారికి నడుము, వెన్నెముక, మణికట్టు వద్ద ఉండే ఎముకలు త్వరగా విరిగిపోతాయి. దాంతోపాటు శరీరంలో కాల్షియం తగ్గడం, విటమిన్ డి తగ్గిపోవడం, థైరాయిడ్ గ్రంథి పనితీరులో లోపాలు, మధుమేహం, వయస్సు మీద పడడం వంటి అనేక కారణాల వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. అయితే ఎవరైనా కింది సూచనలు పాటిస్తే ఇలాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. దాంతో ఎముకలు దృఢంగా మారుతాయి కూడా. మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి నిత్యం ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. దాంతో ఎముకలు దృఢంగా మారుతాయి.

ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో అల్లం రసం, తేనెలను సమపాళ్లలో కలిపి తీసుకుంటే ఎముకల వ్యాధులు రాకుండా ఉంటాయి.

ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ తేనె, రెండు చిటికెల పిప్పళ్ల చూర్ణాన్ని కలిపి తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయి.

ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో మద్ది చెక్క చూర్ణాన్ని ఒక టీస్పూన్ మోతాదులో కలిపి తాగితే ఎముకలు బలంగా ఉంటాయి.

నువ్వుల పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కలిపి తాగితే ఎముకలు సమస్యలు ఉండవు.

కాల్షియం ఎక్కువగా ఉండే పాలకూర, పాలు, పెరుగు, గుడ్లు, మునగ ఆకు, బాదం పప్పు తదితర ఆహారాలను నిత్యం తీసుకుంటున్నా ఎముకలు దృఢంగా ఉంటాయి.